Rashmi Gautam : టాప్ పొజిషన్ కి చేరుకోవాలంటే.. అందరితో బెడ్ షేర్ చేసుకోవాలి.. రష్మి గౌతమ్ పోస్ట్ వైరల్!

March 10, 2022 6:04 PM

Rashmi Gautam : బుల్లితెర యాంకర్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మి బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వీరి జంటకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్వాహకులు వీరితో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న రష్మి ఒకానొక సమయంలో వెండితెరపై కూడా రచ్చ చేసింది. రష్మీ పలు చిత్రాలలో గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆమె న‌టించిన‌ సినిమాలు తనకు గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.

Rashmi Gautam sensational comments on heroines
Rashmi Gautam

వెండితెరపై గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉండి పోయింది. ఇక రష్మీ తాజాగా మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నందు, రష్మి జంటగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక మీమ్ పై స్పందిస్తూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందనే విషయానికి వస్తే.. టాప్ పొజిషన్ కు చేరుకోవడం కోసం హీరోయిన్లు కచ్చితంగా అందరితోనూ పడుకుని ఉంటారు.. అన్న మీమ్ పై రష్మీ స్పందిస్తూ.. అవును అందరూ ఎంతో సింపుల్ గా ఆ మాట అంటారు.. అంటూ ఆ మీమ్ పై రేష్మి స్పందించింది. నిజానికి ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. దీనిపై ర‌ష్మి ప‌రోక్షంగా స్పందించింద‌ని అంటున్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment