Rashmi Gautam : యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌పై నందు ఆగ్ర‌హం.. కార‌ణం అదే..!

October 19, 2022 7:29 AM

Rashmi Gautam : రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో నందు, రష్మీ గౌతమ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బొమ్మ బ్లాక్‌ బస్టర్‌. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం గత రెండేళ్ల క్రితమే షూటింగ్‌ పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అసలు ఈ సినిమా ఉందనే విషయాన్ని కూడా చాలామంది ప్రేక్షకులు మరచిపోయారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్‌. నవంబర్‌ 4న బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం విడుదల కాబోతుంది.

హీరో నందు ఈ సినిమా మాసి లుక్ లో కనిపించబోతున్నాడు. ఎప్పటినుంచో హీరో గా సరైన సక్సెస్ లేని నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో రష్మీ గౌతమ్ కూడా రగ్డ్ లుక్‌లో కనిపించడం, పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇదివరకే విడుదల చేసిన టీజర్, పాటలు అన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి.

Actor Nandu angry on Rashmi Gautam for his next film
Rashmi Gautam

కానీ ఇప్పుడు ఈ సినిమాపై తాజాగా నందు, రష్మీ గొడవ పడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే  సినిమా ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడానికి ప్రమోషన్స్ కోసం మూవీ మేకర్స్ అన్నీ సిద్ధం చేసుకున్నారట. కానీ ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన ఎత్తగం లేదని, సినిమా ప్రమోషన్స్‌కి రావట్లేదంటూ యాంకర్‌ రష్మీగౌతమ్‌పై హీరో నందు ఫైర్‌ అయ్యాడు. అంతేకాకుండా యాంకర్‌ రష్మీ షూటింగ్‌ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశాడట. అదేవిధంగా రష్మీ కూడా నందుపై ఫైర్‌ అయింది. నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదని మొహం మీదే చెప్పేసిందట. ఇదంతా చదివి నిజంగానే రష్మీ గౌతమ్‌, నందు నిజంగా గొడవ పడ్డారని అనుకోకండి. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్స్‌ కోసం వీరిద్దరు ఈ ఫ్రాంక్‌ వీడియో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

 నందు తన సినిమా ప్రమోషన్లను కూడా వెరైటీ చేస్తూ వస్తున్నాడు. బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా నందు ఆ మధ్య తన సినిమా టైటిల్ ప్రకటన మీద ప్రమోషన్స్ చేశాడు. అదే సమయంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోంది. అలా బీబీ అప్డేట్ ఇస్తున్నానని చెప్పడంతో అందరూ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నాడేమో అని అనుకున్నారు. కానీ చివరకు బీబీ అంటే తన కొత్త సినిమా టైటిల్‌ బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అని సెల‌విచ్చాడు నందు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now