Jabardasth : రష్మీ రెమ్యునరేషన్ పై హైపర్ ఆది పంచ్‌లే పంచులు.. తెగ న‌వ్వించాడుగా..

October 14, 2022 1:05 PM

Jabardasth : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చిందన్న విషయం తెలిసిందే. ఇందులో గుర్తింపు పొందిన అనేకమంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. అయితే హైపర్ ఆది రీఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ షో కళకళలాడుతోంది. కమెడియన్స్ అంతా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. కమెడియన్లు 2 టీమ్స్ గా విడిపోయి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు.

బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, రాకింగ్ రాజేష్ ఒక గ్యాంగ్ గా మారి క్రికెట్ బ్యాట్స్ తో ఎంట్రీ ఇచ్చారు. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిలని ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. మా అబ్బాయిలని వదిలేయండి.. లేకుంటే రక్తపాతాలే అంటూ ఇమ్మాన్యూల్ కామెడీగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ తన గ్యాంగ్ తో హాకీ స్టిక్స్ చేత పట్టుకుని రంగంలోకి దిగారు. హైపర్ ఆది ఆపోజిట్ గ్యాంగ్ పై తనదైన శైలిలో వరుసగా పంచ్ డైలాగ్స్ పేల్చాడు.

Jabardasth hyper aadi comments on rashmi gautam remuneration
Jabardasth

మధ్యలో బుల్లెట్ భాస్కర్ కల్పించుకుని.. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు రష్మీ.. పద వెళదాం.. నీ పేమెంట్ నేను ఇంటికి పంపిస్తా అని బీరాలు పలుకుతూ చెబుతాడు. దీంతో బులెట్ భాస్కర్ కి హైపర్ ఆది ఇచ్చిన కౌంటర్ అదిరిపోయింది. నువ్వు రష్మీకి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే 100 పెద్దమనిషి ఫంక్షన్స్ చేసినా సరిపోదు అంటూ కామెంట్స్ చేశాడు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇది కేవలం ప్రోమో మాత్రమే కంప్లీట్ ఎపిసోడ్ అక్టోబర్ 20న ప్రసారం కానుంది. హైపర్ ఆది రీఎంట్రీ తో జబర్దస్త్ కి కొత్త జోష్ తీసుకువచ్చాడు అంటున్నారు నెటిజన్స్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now