గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rajnikanth : చంద్ర‌బాబుకి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించిన ర‌జ‌నీకాంత్..!

Rajnikanth : చంద్ర‌బాబు ఉదంతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం అయిన విష‌యం తెలిసిందే. చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప‌లువురు…

Rajnikanth : చంద్ర‌బాబుకి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించిన ర‌జ‌నీకాంత్..!

Rajnikanth : చంద్ర‌బాబు ఉదంతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం అయిన విష‌యం తెలిసిందే. చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప‌లువురు ప్రముఖులు కూడా వైసీపీ నేత‌ల తీరుని ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు.

Rajnikanth made a phone call to chandra babu

ప్ర‌కాశ్ రాజ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు వంటి వారు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి, అంబటి రాంబాబు.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు, తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పరుష పదజాలంతో దూషించారంటూ.. వార్తలు వచ్చాయి. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది.

భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరిపై మండిపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని వీరు మొదలు పెట్టారు. వీళ్లిద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తులు. అలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి