గురువారం, జూన్ 11, 2026
వినోదం

Rajinikanth : కేవ‌లం సినిమాల ద్వారానే ర‌జ‌నీకాంత్ అన్ని ఆస్తుల‌ను కూడ‌బెట్టారా..!

Rajinikanth : కండ‌క్ట‌ర్ నుండి సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన ర‌జ‌నీకాంత్ ఎంతో మందికి ఆద‌ర్శం. ఆయ‌న న‌టుడిగా క‌న్నా కూడా మంచి మ‌నిషిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి…

Rajinikanth : కేవ‌లం సినిమాల ద్వారానే ర‌జ‌నీకాంత్ అన్ని ఆస్తుల‌ను కూడ‌బెట్టారా..!

Rajinikanth : కండ‌క్ట‌ర్ నుండి సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన ర‌జ‌నీకాంత్ ఎంతో మందికి ఆద‌ర్శం. ఆయ‌న న‌టుడిగా క‌న్నా కూడా మంచి మ‌నిషిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించిన ర‌జ‌నీకాంత్ ఎంతో మందికి ఆద‌ర్శం. ఆయ‌న 71వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా త‌లైవాకి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

did Rajinikanth got that much assets with only movies

రజనీకాంత్ సినిమాల ద్వారానే బాగానే సంపాదించారు. రూ.కోట్లలో పారితోషికం తీసుకుంటూ దివంగత నటుడు ఎంజీఆర్‌కు తర్వాత స్థానంలో ఉన్నారు రజనీ. కక్నా లెడ్జ్‌ 2021 నివేదిక ప్రకారం.. రజనీ నికర ఆస్తుల విలువ రూ.360 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఆయన సినిమాల ద్వారా సంపాదించారు. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తే ఇంకెన్ని కోట్లు సంపాదించే వారో అని అంద‌రూ ముచ్చ‌టించుకుంటున్నారు.

సినిమా ప్లాప్ అయి నష్టాలొస్తే తీసుకున్న పారితోషికం కూడా నిర్మాతకు తిరిగి ఇచ్చేసే అంత గొప్ప హృదయం ఆయన సొంతం. ఇక విలాసవతంమైన జీవితానికి సూపర్ స్టార్ ఎప్పుడూ దూరమే. చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. అయితే రజనీ ఇల్లు మాత్రం చాలా లగ్జరీయస్ గా ఉంటుంది. ఇల్లు బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్మే వ్యక్తి. ఇక వాహనాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. టయోటా ఇన్నోవా.. రేంజ్ రోవర్.. బెంట్లీ కార్లు ఉన్నాయి. రూ.100-120 కోట్ల పెట్టుబడులను పెట్టారు. వివిధ వ్యాపారాల్లో ఈ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి