చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీ అది.. ఆ క‌థ‌తో రికార్డుల‌ను బ్రేక్ చేసిన ర‌జినీ.. ఆ మూవీ ఏదంటే..?

September 25, 2022 9:41 PM

సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే అంత‌. కొంద‌రు హీరోలు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే క‌థ‌ల‌ను రిజెక్ట్ చేస్తారు. అయితే అవే క‌థ‌ల‌తో వేరే హీరోలు సినిమాలు తీసి హిట్ కొడ‌తారు. ఇంకా చెప్పాలంటే.. అలా కొంద‌రు హీరోలు రిజెక్ట్ చేసిన క‌థ‌ల‌ను ఇంకొంద‌రు హీరోలు తీసి రికార్డుల‌ను కొల్ల‌గొడుతుంటారు. ఇలా చాలా మంది హీరోల‌కు జ‌రుగుతూనే ఉంటుంది. ఇక అసలు విష‌యానికి వ‌స్తే.. అప్ప‌ట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా. కానీ క‌థ న‌చ్చ‌లేద‌ని ఆయ‌న రిజెక్ట్ చేశారు. దీంతో ర‌జ‌నీకాంత్ అదే క‌థ‌ను ఓకే చేశారు. ఫ‌లితంగా ఆ మూవీతో ర‌జ‌నీ హిట్ కొట్టారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయి రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఇంత‌కీ అస‌లు ఆ మూవీ ఏదంటే..

అప్ప‌ట్లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ సురేష్ గోపి ప్రధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం మ‌ణిచిత్ర తాల్. ఈ సినిమాలో శోభ‌న హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా 1993లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాకు రీమేక్ గా 2004 లో క‌న్న‌డలో ఆప్త‌మిత్ర అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో సౌంద‌ర్య హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో విష్ణువర్థ‌న్ హీరోగా న‌టించారు. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.

chiranjeevi rejected movie rajinikanth got success

కాగా ఇదే సినిమాను త‌మిళ్ లో రజినీకాంత్ హీరోగా చంద్ర‌ముఖి అనే టైటిల్ ల్ తో తెర‌కెక్కించారు. అంతే కాకుండా ప్ర‌భు ముఖ్య పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాలో జ్యోతిక‌, న‌య‌న‌తార‌ హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమాకు మొద‌ట నాగ‌వ‌ల్లి అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ర‌జినీకాంత్ చంద్ర‌ముఖి అనే టైటిల్ ను సూచించ‌డంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2005లో వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ ల‌లో జ్యోతిక న‌ట‌న‌కు తీవ్రంగా భ‌య‌ప‌డిపోయారు.

అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా డ‌బ్ చేయ‌గా ఇక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే నిజానికి ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య ఆప్త‌మిత్ర సినిమా చూడాల‌ని చిరంజీవికి ముందుగానే సీడీని పంపించాడు. ఇక‌ ఆ సినిమాను చూసిన చిరు రిజెక్ట్ చేశారు. ఆయ‌న‌కు చంద్ర‌ముఖి క‌థ న‌చ్చ‌లేదు. దీంతో ర‌జనీ ఆ మూవీని చేశారు. రికార్డుల‌ను బ్రేక్ చేశారు. అయితే చంద్ర‌ముఖి విడుద‌ల‌య్యాక చిరు వీఎన్ ఆదిత్య‌కు ఫోన్ చేసి ఆయ‌నను అభినందించాడు. అలా చిరు రిజెక్ట్ చేసిన క‌థ‌తో ర‌జినీ రికార్డులు క్రియేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఒక మంచి మూవీని మిస్ అయ్యార‌ని చెప్ప‌వ‌చ్చు. లేదంటే ఆయ‌న‌కు క్రేజ్ మ‌రింత‌గా పెరిగేది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now