Rajnikanth : కుమార్తె విడాకుల‌పై తీవ్ర ఆందోళ‌న చెందుతున్న ర‌జ‌నీకాంత్‌..?

January 27, 2022 3:01 PM

Rajnikanth : సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం విడాకులు అనేవి కామ‌న్‌గా మారిపోయాయి. బ‌య‌ట మార్కెట్‌కు వెళ్లి కూర‌గాయ‌లు కొనుక్కుని వ‌చ్చినంత తేలిగ్గా సెల‌బ్రిటీ జంట‌లు విడాక‌కుల‌ను తీసుకుంటున్నారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకులు సంచ‌ల‌నం సృష్టించ‌గా.. తాజాగా ర‌జ‌నీ అల్లుడు, న‌టుడు ధ‌నుష్, ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య‌లు విడాకులు తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Rajnikanth worrying about his daughter aishwarya dhanush divorce

త‌న కుమార్తె, అల్లుడు విడాకులు తీసుకోవ‌డంపై ర‌జ‌నీకాంత్ తీవ్ర ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో ఆయ‌న తీసిన బాబా అనే మూవీలో సైతం కుటుంబ అనుబంధాలు, ఆత్మీయ‌త‌ల‌పై ప‌లు మార్లు ఆయ‌న డైలాగ్‌లు చెప్పారు. అయితే ఆ డైలాగ్‌లు ర‌జ‌నీ జీవితంలోనే ప్ర‌భావితం అవుతాయ‌ని బ‌హుశా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.

ఇప్ప‌టికే ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌లు ప‌లు సంద‌ర్భాల్లో త‌మ మ‌ధ్య ఉన్న గొడ‌వ‌ల‌పై ర‌జ‌నీకాంత్ వ‌ద్ద‌కు వెళ్లారట‌. దీంతో ర‌జనీ చాలా సార్లు వారిద్ద‌రికీ న‌చ్చ‌జెప్పార‌ట‌. అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంతా స‌ద్దుమ‌ణిగింద‌ని భావించే లోపే వారిద్ద‌రూ విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇలా వారు త‌మ కుటుంబ స‌మ‌స్య‌ను ర‌చ్చ చేయ‌డం ర‌జ‌నీకి అస‌లు ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. దీంతో ఆయ‌న త‌న కుమార్తె భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందా.. అని త‌ల్లడిల్లిపోతున్నార‌ట‌.

అయితే ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌ల‌ను మ‌ళ్లీ క‌లిపేందుకు ఆయ‌న శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గొడ‌వ‌ల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించేందుకు ర‌జ‌నీకాంత్ చొర‌వ చూపుతున్నార‌ట‌. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఉన్న గొడ‌వ‌ల‌తో ఆయ‌న ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆ ఇద్దరూ మ‌ళ్లీ క‌లుస్తారా.. లేదా విడిపోతారా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now