Poonam Bajwa : యోగా డ్రెస్‌లోనూ అందాల‌ను ఆర‌బోస్తున్న పూన‌మ్ బ‌జ్వా..!

February 1, 2022 7:08 PM

Poonam Bajwa : సోష‌ల్ మీడియాలో పూన‌మ్ బ‌జ్వా ఈమ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఎప్ప‌టిక‌ప్పుడు పిచ్చెక్కించే రీతిలో త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఇక తాజాగా యోగా చేస్తూ ఈ బ్యూటీ అందాల‌ను ఆర‌బోసింది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్ అవుతున్నాయి.

Poonam Bajwa latest yoga dress photos
Poonam Bajwa

పూన‌మ్ బ‌జ్వా ఫిట్ నెస్ ప‌ట్ల ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తుంది. ఎంతో ఫిట్‌గా ఉంటూ గ్లామ‌ర్ షో చేస్తున్నా.. ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు మాత్రం పెద్ద‌గా రావ‌డం లేదు. ఇప్ప‌టికే ఎన్నోసార్లు అందాల‌ను ఆర‌బోస్తూ దిగిన ఫొటోల‌ను ఈమె షేర్ చేసింది. అయినా పెద్ద‌గా ఫ‌లితం లేదు. ఇప్ప‌టికే కెరీర్ చివ‌ర్లో ఉన్న‌ట్లుగా పూన‌మ్ బ‌జ్వా ప‌రిస్థితి మారింది.

Poonam Bajwa : స‌రైన పాత్ర ల‌భించ‌లేదు..

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది యంగ్ హీరోయిన్లు ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌కాశాల‌ను అంది పుచ్చుకుంటూ కెరీర్‌లో వేగంగా దూసుకెళ్తున్నారు. కానీ పూన‌మ్ బ‌జ్వా మాత్రం కెరీర్ తొలినాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాల‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. వ‌చ్చిన రెండు, మూడు అవ‌కాశాల్లోనూ ఈమెకు స‌రైన పాత్ర ల‌భించ‌లేదు. పైగా ఆ మూవీలు హిట్ కూడా కాలేదు.

సినిమాలు హిట్ అయితేనే ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాంటిది హిట్స్ లేకుండా సినిమా అవ‌కాశాల‌ను ఆశించ‌డం అంటే.. అది సాహ‌స‌మ‌నే చెప్పాలి. మ‌రి ఈ అమ్మ‌డికి రానున్న రోజుల్లో అయినా అదృష్టం క‌ల‌సి వ‌స్తుందా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment