Poonam Bajwa : అందాల‌న్నీ ఆర‌బోస్తూ.. పూన‌మ్ బ‌జ్వా లేటెస్ట్ ఫొటోషూట్‌..!

January 26, 2022 5:39 PM

Poonam Bajwa : పూన‌మ్ బ‌జ్వా.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఈమెను దాదాపుగా మ‌ర్చిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అప్పుడ‌ప్పుడు ఫొటోషూట్స్ ద్వారా మ‌ళ్లీ ఈమె ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని ఉత్సాహం చూపిస్తున్నా.. ఈమెను ఎవ‌రూ క‌నిక‌రించ‌డం లేదు. ఒక‌ప్పుడు ఈమె గ్లామ‌ర్‌నే న‌మ్ముకుంది. ప‌లు సినిమాల్లో అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఈమె ద‌శ తిర‌గ‌లేదు. దీంతో ఈమెను అంద‌రూ మ‌రిచిపోయారు.

Poonam Bajwa latest maroon color dress photos viral

ఇక ఈ మ‌ధ్య కాలంలో పూన‌మ్ బ‌జ్వా త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. అందుకు కార‌ణం.. ఈ అమ్మ‌డు చేస్తున్న ఫొటోషూట్స్ అని చెప్ప‌వ‌చ్చు. భారీ అందాల‌ను బ‌హిర్గ‌తం చేస్తూ రెచ్చిపోయేలా ఈమె ఫొటోషూట్స్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌గా కూడా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కించే ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది.

తాజాగా పూన‌మ్ బ‌జ్వా మెరూన్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది. వాటిల్లో ఈమె అందాల‌న్నీ క‌నువిందు చేస్తున్నాయి. ఆ ఫొటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

పూన‌మ్ బ‌జ్వా 2005లో మొద‌టి సినిమా అనే చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. త‌రువాత నాగార్జున‌తో క‌లిసి బాస్ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆమెకు కాలం క‌ల‌సి రాలేదు. దీంతో మ‌రోమారు అవ‌కాశాల కోసం య‌త్నిస్తోంది.

ఇక ఈమె తాజాగా త‌న ప్రియుడు, తిక్క మూవీ ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డిని పెళ్లి చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కొంత కాలం పాటు అత‌నితో క‌లిసి ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది. త‌రువాత ఆ ఫొటోల‌ను షేర్ చేయ‌డం లేదు. దీంతో ఈ ఇద్ద‌రూ విడిపోయారా..? అని సందేహాలు క‌లుగుతున్నాయి. కాగా పూన‌మ్ బ‌జ్వా చివ‌రిసారిగా 2019లో ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌లో న‌టించింది. అందులో గార‌పాటి లోకేశ్వ‌రి పాత్ర‌లో ఈమె అల‌రించింది. ప్ర‌స్తుతం ప‌ట్టోన్పాత‌న్ ఒత్తండు అనే మ‌ళ‌యాళ మూవీలో ఈ అమ్మ‌డు న‌టిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment