గురువారం, జూన్ 11, 2026
సినిమా

ఓటీటీ బాటలో వెళ్తున్న నితిన్ మాస్ట్రో ?

ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండి , థియేటర్లో విడుదలకు నోచుకోలేక పోయాయి. ఈ క్రమంలోనే పలు సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యి…

ఓటీటీ బాటలో వెళ్తున్న నితిన్ మాస్ట్రో ?

ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండి , థియేటర్లో విడుదలకు నోచుకోలేక పోయాయి. ఈ క్రమంలోనే పలు సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న “మాస్ట్రో” చిత్రం కూడా ఓటీటీ విడుదలకాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

నితిన్, తమన్నా, నభా నటేష్ నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వహించగా శ్రేష్ట మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను జూన్ 11వ తేదీన థియేటర్లో విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సమస్థ ఈ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ను పరిశీలనలో పెట్టిన మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు కల్లా థియేటర్లు ఓపెన్ అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేయడానికి ఇష్ట చూపుతున్నారు. ఒకవేళ ఆగస్టు నెలలో థియేటర్లు తెరచుకోకపోతే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి