గురువారం, జూలై 9, 2026
వార్తలు

Nithya Menen : అంద‌రికీ షాకిచ్చిన నిత్య మీన‌న్‌.. సినిమాల‌కు గుడ్‌బై..!

Nithya Menen : నిత్య మీన‌న్ గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. గ్లామ‌ర్ రోల్స్ చేయ‌క‌పోయినా త‌న న‌ట‌న‌తో ఈమె క‌ట్టి ప‌డేస్తుంది. ఇక…

Nithya Menen : అంద‌రికీ షాకిచ్చిన నిత్య మీన‌న్‌.. సినిమాల‌కు గుడ్‌బై..!

Nithya Menen : నిత్య మీన‌న్ గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. గ్లామ‌ర్ రోల్స్ చేయ‌క‌పోయినా త‌న న‌ట‌న‌తో ఈమె క‌ట్టి ప‌డేస్తుంది. ఇక త‌న సినిమాల్లో త‌న పాత్ర‌ల‌కు తానే డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. నిత్య మీన‌న్‌ది యాక్టింగ్‌లో భిన్న‌శైలి అని చెప్ప‌వ‌చ్చు. ప్రేమ సంబంధ‌మైన క్యారెక్ట‌ర్‌లో అయితే ఎంతో అద్భుతంగా న‌టిస్తుంది. అలాంటి చిత్రాలు హిట్ కూడా అయ్యాయి. ఇక చివ‌రిసారిగా ఈమె భీమ్లా నాయ‌క్‌లో న‌టించింది. అయితే ఈమెకు టాలీవుడ్‌లో పెద్ద‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇక నిత్య మీన‌న్ ఉన్న‌ట్లుండి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. త‌న సినిమా కెరీర్‌కు బ్రేక్ వేస్తున్న‌ట్లు చెప్పింది. సినిమాల్లో కొంత కాలం పాటు న‌టించ‌బోన‌ని స్ప‌ష్టం చేసింది. సినిమా షూటింగ్‌ల‌కు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నాన‌ని చెప్పింది. ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈమె అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ.. ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. అయితే తాత్కాలిక‌మే అయిన‌ప్ప‌టికీ ఈమె తీసుకున్న నిర్ణ‌యంపై నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. సినిమాల్లో కంటిన్యూ అవ్వాల‌ని కోరుతున్నారు.

Nithya Menen said good bye to movies this is temporary
Nithya Menen

తాను గ‌త కొంత కాలంగా నిరంత‌రాయంగా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ అల‌సిపోయాన‌ని. అందుక‌నే రిలాక్స్ అవ‌డం కోసం తాత్కాలికంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాన‌ని తెలియ‌జేసింది. అయితే నిత్య అభిమానులు మాత్రం ఆమె నిర్ణ‌యంపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రిగా సినిమాల్లోకి రావాల‌ని కోరుతున్నారు. అయితే ఒక్క‌సారి సినిమా ఇండ‌స్ట్రీకి దూరం అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణించ‌డం క‌ష్ట‌మే. అందుకు ఎంతో ల‌క్ ఉండాలి. మ‌రి నిత్య మీన‌న్‌కు ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి