Nithya Menen : స్టార్ హీరోతో పెళ్లి వార్త‌లు.. స్పందించిన నిత్య మీన‌న్‌..!

July 21, 2022 7:52 AM

Nithya Menen : సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో వ‌స్తున్న వార్త‌ల్లో దేన్ని న‌మ్మాలో.. దేన్ని నమ్మ‌కూడ‌దో అస‌లు తెలియ‌డం లేదు. అనేక వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెల‌బ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో చాలా వ‌ర‌కు నిజ‌మే అవుతున్నాయి. కానీ ఆ వార్త‌ల‌ను స‌ద‌రు సెల‌బ్రిటీలు ఖండించ‌డం లేదు. దీంతో అవి నిజ‌మా.. కాదా.. అన్న అనుమానం నెటిజ‌న్ల‌లో నెల‌కొంటోంది. అయితే ఈ వార్త‌ల‌ను ప‌క్క‌న పెడితే కొంద‌రు కావాల‌నే ఫేక్ వార్త‌ల‌ను సృష్టించి ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అలాంటి వార్త ఒక‌టి నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేసింది. అదే నిత్య మీన‌న్ పెళ్లి విష‌యం.

మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ నిత్య మీన‌న్ త్వ‌ర‌లోనే అదే రాష్ట్రానికి చెందిన ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటుంద‌ని వార్త‌లు వచ్చాయి. ఆమె, అత‌ను గ‌త కొంత‌కాలంగా ల‌వ్ ట్రాక్‌ను న‌డిపిస్తున్నార‌ని, పెద్ద‌ల‌తోనూ ఈ విష‌యాన్ని చెప్పార‌ని.. ఇక పెళ్లి ఒక్క‌టే త‌రువాయి అని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై నిత్య మీన‌న్ స్వ‌యంగా స్పందించింది. మీడియాలో, సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని.. అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని స్పష్టం చేసింది.

Nithya Menen responded on her marriage news
Nithya Menen

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని.. తాను ఇప్పుడు పెళ్లి చేసుకోబోవడం లేద‌ని నిత్య మీన‌న్ తెలియ‌జేసింది. అస‌లు త‌న దృష్టి ప్ర‌స్తుతం సినిమాల‌పైనే ఉంద‌ని, పెళ్లిపై లేద‌ని.. ఆ సంద‌ర్భం వ‌స్తే త‌ప్ప‌క తెలియ‌జేస్తాన‌ని.. ఆమె స్ప‌ష్టం చేసింది. దీంతో ఆమె పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ పుకార్లేన‌ని స్ప‌ష్ట‌మ‌య్యాయి. ఇక నిత్య మీన‌న్ చివ‌రిసారిగా భీమ్లా నాయ‌క్ చిత్రంలో న‌టించ‌గా.. ప్ర‌స్తుతం ఈమెకు తెలుగులో ఆఫ‌ర్లు లేవు. కానీ మ‌ళ‌యాళ చిత్రాల్లో న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment