Nithya Menen : సొంత యూట్యూబ్ చాన‌ల్‌ను లాంచ్ చేసిన నిత్య మీన‌న్‌..!

April 28, 2022 7:49 PM

Nithya Menen : అందాల ముద్దుగుమ్మ నిత్యామీన‌న్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. 1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్.. 2008లో మలయాళ సినిమా ఆకాశ గోపురంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది. అదే ఏడాది సిద్ధార్ధ్ హీరోగా నటించిన నూట్రెన్‌బంధు సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో 180 టైటిల్‌తో విడుదలైంది. మొత్తంగా 14 ఏళ్ల కెరీర్‌లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. 2019లో నిత్యా మీనన్ .. హిందీ ఇండ‌స్ట్రీకి మిషన్ మంగళ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా బాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. అటు హిందీలో అభిషేక్ బచ్చన్‌తో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

Nithya Menen started her own You Tube channel
Nithya Menen

తెలుగు, త‌మిళ, మ‌లయాళ భాష‌ల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత డల్ అయ్యింది. ఇక అడపా దడపా స్టార్ హీరోలతో న‌టిస్తూ బిజీగా మారిపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్‌తో తెలుగు ప్రేక్ష‌కులను మ‌రోమారు ప‌ల‌క‌రించింది. భీమ్లానాయ‌క్ లో పవన్ భార్యగా నిత్య అలరించింది. ఈ పాత్రలో నిత్య‌మీన‌న్ కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక నిత్య తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అనుకుంటుంది.

కాగా అనుకున్నదే తడవుగా.. త‌న ఫాలోవ‌ర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నిత్య‌మీన‌న్. ఆమె త‌న‌ సొంతంగా యూట్యూబ్ చాన‌ల్‌ను లాంచ్‌ చేసింది. దానికి నిత్య అన్‌ఫిల్ట‌ర్డ్ అని పేరు పెట్టింది. త‌న తొలి వీడియోను కూడా ఆ చాన‌ల్‌లో పోస్ట్ చేసింది. తన 12 ఏళ్ల కెరీర్‌కు చెందిన విష‌యాల‌ను అందులో చెప్పింది. ఇక నిత్య ప్ర‌స్తుతం ఆహా ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now