Manchu Vishnu : నిఖిల్‌కు స‌పోర్ట్ ఇస్తూ మంచు విష్ణు ట్వీట్‌.. తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

August 2, 2022 4:24 PM

Manchu Vishnu : మంచు ఫ్యామిలీపై గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ‌ధ్య కాలంలో ట్రోలింగ్ జ‌రుగుతోంది. వారు సోష‌ల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా స‌రే నెటిజ‌న్లు వారిని దారుణంగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవ‌లే మోహ‌న్ బాబు అగ్ని న‌క్ష‌త్రం సినిమా అప్‌డేట్ గురించి పోస్ట్ చేశారు. అయితే దానిపై నెటిజ‌న్లు భారీ స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు వంతైంది. ఆయ‌నపై కూడా నెటిజ‌న్లు భారీగానే ట్రోల్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏమైందంటే..

నిఖిల్ న‌టించిన కార్తికేయ 2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్ప‌టికే సినిమా విడుద‌ల తేదీని ఖ‌రారు చేసి ప్ర‌మోష‌న్స్ చేప‌ట్టారు. కానీ థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌ని.. దీంతో త‌న సినిమాను వాయిదా వేసుకోవాల్సి వ‌స్తోంద‌ని.. సినిమా రంగంలో రాజ‌కీయాల‌కు తాను తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని.. నిఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న గోడును వెళ్ల‌బోసుకున్నాడు. అయితే నిఖిల్‌కు నెటిజ‌న్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స్పందించిన మా ప్రెసిడెంట్‌, న‌టుడు మంచు విష్ణు.. నిఖిల్‌కు స‌పోర్ట్‌గా ఉంటాన‌ని తెలిపారు.

netizen troll Manchu Vishnu for responding on Nikhil problems
Manchu Vishnu

నిఖిల్‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటాన‌ని.. త‌మ్ముడూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని.. నీ సినిమా కోసం నేను కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని.. మంచు విష్ణు ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజ‌న్లు స్పందించారు. నీకే దిక్కు లేదు.. నువ్వు నిఖిల్‌కు ఎలా స‌పోర్ట్ ఇస్తావ‌ని.. విష్ణును నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అది స‌రే.. మా అసోసియేష‌న్ బిల్డింగ్ ఏమైంది చెప్పు.. అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విష్ణుకు ట్రోల‌ర్ల నుంచి బాగానే సెగ త‌గులుతోంది. అయితే వాస్త‌వానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌స్తుతం క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. దీంతో చిన్న‌, మ‌ధ్య బ‌డ్జెట్ సినిమాలకు చెందిన మేక‌ర్స్ ఉక్కిరి బిక్కిర‌వుతున్నారు. ఇక నిఖిల్ మూవీ ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment