Manchu Vishnu : మా అసోసియేషన్‌ రూల్స్‌ కఠినం.. తప్పు చేస్తే నిషేధం.. మంచు విష్ణు..

October 14, 2022 8:27 AM

Manchu Vishnu : మా అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొద్ది నెలల పాటు ఆయన మా సమస్యలపై ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో.. అందరూ విమర్శించారు. మా భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని ప్రత్యర్థులు కౌంటర్‌ వేశారు. దీంతో కొంత కాలానికి విష్ణు స్పందించి మా సమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. అయితే తాజాగా అసోసియేషన్‌ నియమ నిబంధనలను పూర్తిగా మార్చేసినట్లు చెప్పారు. ఇకపై రూల్స్‌ చాలా కఠినంగా ఉంటాయన్నారు. మా మెంబర్‌షిప్‌ పొందడం అంత ఈజీ కాదన్నారు. కొందరు మెంబర్లుగా ఉన్నప్పటికీ ఒక్కసినిమాలోనూ నటించలేదన్నారు. కనుక రూల్స్‌ను మారుస్తున్నట్లు చెప్పారు.

ఇక మా సభ్యులు ఎవరైనా తమకు సమస్యలు ఉంటే అసోసియేషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని.. మీడియా ముందుకు వెళ్లకూడదని.. విష్ణు అన్నారు. ఎవరైనా మీడియా ముందుకు వెళితే అలాంటి వారిని వెంటనే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు పరుస్తామని.. తప్పు చేశారని తేలితే వెంటనే అసోసియేషన్‌ నుంచి సస్పెండ్‌ చేస్తామని.. అలాగే అవసరం అయితే శాశ్వతంగా నిషేధం విధిస్తామని.. దీంతో వారు మా అసోసియేషన్‌లో ఉండేందుకు అనర్హులని అన్నారు.

Manchu Vishnu said Maa rules will be more strict
Manchu Vishnu

అలాగే మా అసోసియేషన్‌లో సభ్యులుగా కనీసం 5 ఏళ్ల నుంచి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులని విష్ణు అన్నారు. అయితే వారు సస్పెండ్‌ అయి ఉన్నా లేదా మా కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. వ్యతిరేకంగా మాట్లాడినా.. వారు పోటీ చేసేందుకు అనర్హులని తెలిపారు. ఈ రూల్స్‌ అన్నింటినీ త్వరలోనే మార్చబోతున్నట్లు వివరించారు. కాగా విష్ణు చెప్పిన ఈ విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఏడాది కిందట మా అధ్యక్షుడిగా గెలిచిన ఆయన అప్పుడే రూల్స్‌ మార్చకుండా ఇంతకాలం ఎందుకు వెయిట్‌ చేశారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కొత్త రూల్స్‌ కాస్త కఠినంగానే ఉన్నాయని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now