Naga Chaitanya : స‌మంత‌ను ఇంకా మ‌రిచిపోలేక‌పోతున్న నాగ‌చైత‌న్య‌..? అవి ఇంకా అలాగే ఉన్నాయి..?

July 8, 2022 7:33 AM

Naga Chaitanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుని ఎంతో కాలం అవుతున్న విష‌యం విదిత‌మే. వీరు గ‌తేడాది అక్టోబ‌ర్‌లో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చారు. త‌మ సోష‌ల్ ఖాతాల్లో వీరు వేర్వేరుగా పోస్టులు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ వీరు విడాకులు తీసుకుంటున్నార‌ని తెలిసి షాక‌య్యారు. అంత అన్యోన్యంగా ఉన్న వీరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు.. అన్న విష‌యం ఎవ‌రికీ అర్థం కాలేదు. కానీ ఇప్ప‌టికీ అస‌లు వీరి విడాకుల‌కు స‌రైన కార‌ణాలు అయితే ఎవ‌రికీ తెలియ‌దు.

ఇక నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత స్వేచ్ఛా జీవి అయింది. త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్లు తాను జీవిస్తోంది. గ‌తంలోక‌న్నా ఎక్కువ‌గా గ్లామ‌ర్ షో చేస్తోంది. సినిమాలు, సిరీస్‌లు, యాడ్స్‌.. ఇలా లెక్క లేకుండా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. మ‌రోవైపు త‌న సోష‌ల్ ఖాతాల్లో ఉన్న నాగ‌చైత‌న్య ఫొటోలు అన్నింటినీ స‌మంత డిలీట్ చేసింది. అయితే నాగ‌చైత‌న్య మాత్రం త‌న సోష‌ల్ ఖాతాల్లో ఉన్న స‌మంత ఫొటోల‌ను ఇంకా డిలీట్ చేయ‌లేద‌ట‌. వాటిని అలాగే ఉంచాడ‌ట‌.

Naga Chaitanya did not delete Samantha photos in his social accounts
Naga Chaitanya

నాగ‌చైత‌న్య సోష‌ల్ మీడియాలో అంత ఎక్కువ యాక్టివ్‌గా ఉండ‌డు. ఎప్పుడో ఒక పోస్ట్ పెడుతుంటాడు. కానీ స‌మంత‌కు చెందిన ఫొటోల‌ను మాత్రం ఆయ‌న డిలీట్ చేయ‌లేద‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌మంత‌ను ఆయ‌న ఇంకా మ‌రిచిపోలేక‌పోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు స‌మంత మాత్రం ఆయ‌న ఫొటోలు అన్నింటినీ ఎప్పుడో డిలీట్ చేసింది. అలాగే ఆయ‌న ఇచ్చిన గిఫ్ట్‌లు, ఇత‌ర వ‌స్తువుల‌ను కూడా ఆయ‌న‌కు పంపించివేసింది. ఇక ఆమె శ‌రీరంపై మాత్రం వారి పెళ్లికి సంబంధించిన టాటూలు ఉన్నాయి. మ‌రి స‌మంత వాటిని కూడా తీసేస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment