Meera Jasmine : వామ్మో.. మీరా జాస్మిన్ ఏంటిది.. అది అడ్డుగా ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది.. లేక‌పోతేనా..?

June 14, 2022 5:32 PM

Meera Jasmine : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మీరా జాస్మిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు గుడుంబా శంక‌ర్ మూవీ ద్వారా తెలుగు తెర‌కు పరిచ‌యం అయింది. అంత‌కు ముందు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం భాష‌ల్లో అనేక సినిమాలు చేసిన‌ప్ప‌టికీ గుడుంబా శంక‌ర్ మూవీ ద్వారానే ఈమెకు త‌గిన గుర్తింపు వ‌చ్చింది. దీంతో తెలుగులో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఆ త‌రువాత ఆమె భ‌ద్ర‌లో ఫ్యామిలీ హీరోయిన్ పాత్ర‌లో న‌టించి అల‌రించింది. అలాగే రారాజు, మ‌హార‌థి, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది, గోరింటాకు వంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఇవేవీ పెద్ద‌గా హిట్ కాలేదు.

ఇక ఆ త‌రువాత ఈమె న‌టించిన అమ్మాయి బాగుంది.. అనే మూవీ ఒక్క‌టే ఫ‌ర్వాలేద‌నిపించింది. త‌రువాత ఈమె సినిమాలు ఏవీ తెలుగులో హిట్ కాలేదు. కానీ ఇత‌ర భాష‌ల చిత్రాల్లో లెక్క‌కు మించి సినిమాలే చేసింది. అయితే ఎంతో కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన మీరా జాస్మిన్ ఈమ‌ధ్య మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగానే ఈమె సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అల‌రిస్తోంది. ఈ అమ్మ‌డు గ‌తంలో ఫ్యామిలీ హీరోయిన్‌గా క‌నిపించింది. కానీ ఇప్పుడు గ్లామ‌ర్ డోసు పెంచి క‌నిపిస్తోంది. ఈమె ఇటీవ‌లి కాలంలో పోస్ట్ చేసిన చాలా వ‌ర‌కు ఫొటోల్లో అందాలు ఆర‌బోసిన‌వే ఉంటున్నాయి. ఇక తాజాగా మ‌రోమారు ఈమె అలాంటి ఫొటోల‌నే షేర్ చేసి యువ‌త గుండెల్లో చిచ్చు పెట్టింది.

Meera Jasmine latest photo viral on social media
Meera Jasmine

మీరా జాస్మిన్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో త‌న అందాల‌కు చున్నీని అడ్డుగా పెట్టుకుని క‌వ్విస్తూ ఫొటోలు దిగింది. అనంత‌రం వాటిని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆమె చున్నీ అడ్డుగా పెట్టుకుంది కాబ‌ట్టి స‌రిపోయింది.. లేకపోతే అందాల జాత‌రేన‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షో చూసి అయినా ఈమెకు అవ‌కాశాలు ఇస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment