గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Lijomol Jose : ఎలుక‌లు తిన్నా, అచ్చం చికెన్ తిన్నట్టు ఉందన్న జై భీమ్ న‌టి..!

Lijomol Jose : సూర్య న‌టించిన తాజా చిత్రం జై భీమ్. ఈ మూవీ ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. ఇందులోని కొన్ని పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సినతల్లి పాత్ర అంద‌రికీ బాగా…

Lijomol Jose : ఎలుక‌లు తిన్నా, అచ్చం చికెన్ తిన్నట్టు ఉందన్న జై భీమ్ న‌టి..!

Lijomol Jose : సూర్య న‌టించిన తాజా చిత్రం జై భీమ్. ఈ మూవీ ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. ఇందులోని కొన్ని పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సినతల్లి పాత్ర అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయింది. సినతల్లి పాత్రలో జీవించింది లిజోమోల్ జోస్. జైభీమ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఆమె ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలను తెలియ‌జేసింది.

Lijomol Jose said that she tasted rats they are like chicken
Lijomol Jose said that she tasted rats they are like chicken

తెలుగులో డబ్ అయిన సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ధి సినిమాతో టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చింది లిజోమోల్. జై భీమ్‌ మూవీలో  లిజోమోల్ ఓ గిరిజన మహిళగా.. గర్భవతిగా నటించింది అందరితోనూ కన్నీళ్లు పెట్టించింది. సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఆ పాత్రను పోషించడానికి ఎంతో కష్టపడిందట.

జై భీమ్‌లో పాత్ర కోసం డైటింగ్ చేసి బ‌రువు కూడా త‌గ్గాను అని చెప్పింది. అలాగే తాను చేసింది గిరిజ‌న స్త్రీ పాత్ర‌. అంత సుల‌భంగా చేయ‌లేం. కాబ‌ట్టి గిరిజ‌న తెగ‌కు చెందిన మ‌హిళ‌ల‌ను క‌లుసుకుని వారితో కొన్ని రోజ‌లు గ‌డిపాను అని పేర్కొంది.

Lijomol Jose : ఎలుక మాంసం కూడా రుచి చూశాను..

గిరిజ‌నులు పాము కాటుకు ఎలా చికిత్స చేస్తారు. ఆ స‌మ‌యంలో ఏ ఔష‌ధాల‌ను ఉప‌యోగిస్తార‌నే విష‌యాల‌ను కూడా వారి నుంచి తెలుసుకున్నాను. అంతే కాకుండా.. వారితో క‌లిసి ఎలుక‌లు ప‌ట్ట‌డానికి కూడా వెళ్లి, వారెలా ప‌డుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓసారి ఎలుక మాంసం కూడా రుచి చూశాను, చికెన్ తిన్న‌ట్టే అనిపించింది.. అని తెలిపింది లిజోమోల్ జోస్.

అయితే జైభీమ్‌ చిత్రానికి మొదట్లో పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కానీ రాను రాను ఈ మూవీపై వివాదాలు ఎక్కువయ్యాయి. ఒక సీన్‌లో ప్రకాష్‌ ఓ వ్యక్తిని స్థానిక భాష మాట్లాడలేదని చెంప చెళ్లుమనిపిస్తాడు. ఈ సీన్‌పై వివాదం రాజుకుంది. దీంతో ప్రకాష్‌ రాజ్‌ వివరణ ఇచ్చారు. హిందీని అవమానించడం తమ ఉద్దేశం కాదని, ఆ సీన్‌ యాదృచ్ఛికంగానే వచ్చిందని చెప్పారు.

తరువాత తమిళనాడుకు చెందిన  ఓ సంఘం వారు తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ సూర్యపై, జైభీమ్‌ యూనిట్‌పై పరువు నష్టం కేసు వేశారు. అయితే వివాదాల మాట ఎలా ఉన్నప్పటికీ జై భీమ్‌ మాత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సమాజంలో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మూవీకి పబ్లిసిటీ కూడా బాగానే లభించిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి