బుధవారం, జూలై 1, 2026
వార్తలు

Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి చీప్ న‌టి.. నెటిజ‌న్ కామెంట్‌.. రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

Lavanya Tripathi : త‌మిళ‌నాడులో ఇటీవ‌ల లావ‌ణ్య అనే యువ‌తి ఆత్మ‌హ‌త్య సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ఓ మతం నుంచి ఇంకో మ‌తానికి బ‌ల‌వంతంగా మార్పిడి చేస్తున్నార‌ని చెబుతూ.. తాను తీవ్ర ఒత్తిడికి గుర‌య్యాన‌ని..…

Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి చీప్ న‌టి.. నెటిజ‌న్ కామెంట్‌.. రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

Lavanya Tripathi : త‌మిళ‌నాడులో ఇటీవ‌ల లావ‌ణ్య అనే యువ‌తి ఆత్మ‌హ‌త్య సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ఓ మతం నుంచి ఇంకో మ‌తానికి బ‌ల‌వంతంగా మార్పిడి చేస్తున్నార‌ని చెబుతూ.. తాను తీవ్ర ఒత్తిడికి గుర‌య్యాన‌ని.. అందుకే ఆత్మ‌హత్య చేసుకుంటున్నాన‌ని చెప్పి మ‌రీ ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అయితే ఈ సంఘ‌ట‌న‌లోకి న‌టి లావ‌ణ్య త్రిపాఠిని లాగారు. ఓ నెటిజ‌న్ అయితే ఆమె ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో లావ‌ణ్య త్రిపాఠి స్పందించింది. త‌న‌దైన శైలిలో ఆ నెటిజ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చింది.

Lavanya Tripathi given reply to a netizen who called her cheap actress
Lavanya Tripathi

#LavanyaTripathi అనే హ్యాష్‌ట్యాగ్‌ను ద‌య‌చేసి వాడ‌కండి, ఆమె ఒక చీప్ న‌టి, అక్క‌డ చ‌నిపోయింది లావ‌ణ్య‌, ఆమె ఒక ద‌ళిత అమ్మాయి, ఆమె ధ‌ర్మం కోసం పోరాడింది, లావ‌ణ్య త్రిపాఠి లాంటి చీప్ న‌టుల‌ను లావ‌ణ్య లాంటి అమ్మాయిల‌తో పోల్చ‌కండి.. అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. దీంతో లావ‌ణ్య త్రిపాఠి స్పందించింది.

Lavanya Tripathi : గౌర‌వించ‌డం ఎలాగో నేర్చుకోండి..

మీ లాంటి మ‌గ‌వారు మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌డం ఎప్పుడు నేర్చుకుంటారు, అక్క‌డ జ‌రిగింది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌, ఒక‌ర్ని చీప్ అని నిందించే బ‌దులు వారిని గౌర‌వించ‌డం ఎలాగో నేర్చుకోండి, జ‌రిగిన సంఘ‌ట‌న‌కు నేను చాలా చింతిస్తున్నా, మ‌న స‌మాజం ప్ర‌స్తుతం అలాగే ఉంది.. అని లావ‌ణ్య త్రిపాఠి ట్వీట్ చేసింది.

త‌మిళ‌నాడులో లావ‌ణ్య అనే అమ్మాయి చ‌నిపోతే కొంద‌రు లావ‌ణ్య త్రిపాఠి అని హ్యాష్‌ట్యాగ్ జ‌త చేశారు. దీంతో లావ‌ణ్య త్రిపాఠి త‌న‌కు సంబంధం లేక‌పోయినా.. ఆమె అన‌వ‌స‌రంగా ఈ వివాదంలోకి వ‌చ్చి చేరింది. అందులో భాగంగానే సోష‌ల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ కామెంట్లు వ‌స్తున్నాయి. అయితే అన్ని కామెంట్ల‌కు స్పందించ‌డం కుద‌ర‌దు. కానీ ఆమె ఇచ్చిన రిప్లై మాత్రం అంద‌రికీ చేరి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి