Happy Birth Day Movie : లావ‌ణ్య త్రిపాఠి.. హ్యాపీ బ‌ర్త్ డే మూవీ రివ్యూ..!

July 8, 2022 11:42 AM

Happy Birth Day Movie : లావ‌ణ్య త్రిపాఠికి ఈమ‌ధ్య కాలంలో అస‌లు ఆఫ‌ర్లు లేవ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ ఎప్పుడో ఒక చిత్రంతో ఈమె ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తూనే ఉంది. త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే ఉంది. కానీ విజయాలు మాత్రం ల‌భించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈమె తాజాగా హ్యాపీ బ‌ర్త్ డే అనే మూవీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. క‌నీసం దీంతో అయినా ఈమె హిట్ కొట్టిందా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

ర‌క్ష‌ణ శాఖ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్) దేశంలో తుపాకుల ప‌ట్ల ఉండే చట్టాల‌ను స‌వ‌రిస్తాడు. దీంతో గ‌న్‌ల వాడ‌కం ఎక్కువ‌వుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ గ‌న్‌ను కొని వాడ‌డం మొద‌లు పెడ‌తారు. ఇక హైద‌రాబాద్‌లోని రిట్జ్ హోట‌ల్‌లో హౌస్ కీప‌ర్ (న‌రేష్ అగ‌స్త్య‌) ని హోట‌ల్‌లో ఉండే లైట‌ర్ స్థానంలో పెట్టేందుకు య‌త్నిస్తారు. ఇక అక్క‌డే జ‌రిగే ఓ బ‌ర్త్ డే పార్టీకి హ్యాపీ (లావ‌ణ్య త్రిపాఠి) హాజ‌ర‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఆమె కిడ్నాప్‌కు గుర‌వుతుంది. అయితే ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేస్తారు ? ఆమె క‌థేమిటి ? చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంది ? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంది ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Lavanya Tripathi Happy Birth Day Movie Review
Happy Birth Day Movie

విశ్లేష‌ణ‌..

మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమా ద‌ర్శ‌కుడు రితేష్ రాణా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో ఆ మూవీ హిట్ అయింది. ఇక ఆ సినిమాలోని కొన్ని పాత్ర‌ల‌ను కూడా ఇప్ప‌టి మూవీలో చూపించారు. ఈ క్ర‌మంలోనే సినిమా కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కొన‌సాగుతుంది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. అయితే ఓవ‌రాల్‌గా చూస్తే మాత్రం సినిమా కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.

ఈ మూవీలో కామెడీ, ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. అలాగే హీరోయిన్ పాత్రను చిత్రీకరించిన విధానం, బోరింగ్ గా సాగే సీన్స్‌, క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రుస్తాయి. ఇవ‌న్నీ ఫ‌ర్లేదు చూడొచ్చు.. అనుకుంటే ఈ మూవీని ఒక‌సారి చూడ‌వ‌చ్చు. లేదంటే దీనికి దూరంగా ఉండ‌డ‌మే బెట‌ర్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now