Viral Photo : ఈ చిత్రంలో ఉన్న ముద్దులొలికే చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

August 14, 2022 9:50 AM

Viral Photo : ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో  సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన‌ తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఎవరు ఈ క్యూట్ బేబీ అంటూ వెతుకులాట మొదలైంది. ఫోటోల‌లో ముద్దులొలికే ఈ చిన్నారి కాశ్మీరీ అమ్మాయి వస్త్రధారణలో బిందె పట్టుకొని క్యూట్ ఫోజులు ఇచ్చింది. ఎవరు ఈ చిన్నది అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకు ఒక చిన్న క్లూ.. ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో ఫేమస్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. ఈ చదువులు అవి నావల్ల కావడం లేదు.. అంటూ క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

Viral Photo have you identified this actress
Viral Photo

ఈ హీరోయిన్ ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తన అందం, అభినయంతో తెలుగు తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాచురల్ స్టార్ నానికి జోడిగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాకుండా సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలతో సక్సెస్‌ను సాధించింది లావణ్య.

లావణ్య త్రిపాఠి తెలుగుతోపాటు తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. లావణ్య త్రిపాఠి ఇటీవల నటించిన హ్యాపీ బర్త్ డే చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. తాజాగా సూప‌ర్‌ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఒక చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో ఓ వార్త ప్రచారం అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఒకవేళ ఈ చిత్రంలో ఛాన్స్ వస్తే లావణ్యకి లక్ కలిసి వచ్చినట్లే అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now