Lavanya Tripathi : ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో లావ‌ణ్య త్రిపాఠి చాట్‌.. పెళ్లి వార్త‌ల‌పై స్పందించ‌ని బ్యూటీ.. అర్థం ఏమిటి..?

February 1, 2022 8:09 PM

Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి ఈ మ‌ధ్య‌కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తోంది. ఓ పాపుల‌ర్ యంగ్ హీరోతో ఈమె ప్రేమ‌లో ప‌డింద‌ని, వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అందుక‌నే ఆమెకు ప్ర‌పోజ్ చేసేందుకు ఆ హీరో రూ.25 ల‌క్ష‌లు పెట్టి ఓ రింగ్ కూడా కొన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై లావ‌ణ్య త్రిపాఠి ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Lavanya Tripathi  did not respond over her love and marriage issues
Lavanya Tripathi

తాజాగా ఈ భామ షూటింగ్ మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకున్న స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఫ్యాన్స్‌తో చాటింగ్ చేసింది. వారు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు ఇచ్చింది. ప్ర‌స్తుతం హ్యాపీ బ‌ర్త్ డే అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఈమె.. షూటింగ్ బ్రేక్ స‌మ‌యంలో లైవ్‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు.

Lavanya Tripathi : ఓపిగ్గా స‌మాధానాలు ఇచ్చింది..

చాట్ సెష‌న్‌లో భాగంగా ఫ్యాన్స్ అడిగిన అనేక ప్ర‌శ్న‌ల‌కు లావ‌ణ్య త్రిపాఠి ఓపిగ్గా స‌మాధానాలు ఇచ్చింది. త‌న ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ వివ‌రాలు, త‌న ఆహార‌పు అల‌వాట్లు, డైట్‌, ఇత‌ర విష‌యాల గురించి ఫ్యాన్స్ అడ‌గ్గా.. అందుకు ఆమె స‌మాధానాలు చెప్పింది.

అయితే ఓ ద‌శ‌లో కొంద‌రు ఫ్యాన్స్ ప్రేమ‌, పెళ్లి వార్త‌ల‌ను అడిగారు. కానీ ఆమె ఆ ప్ర‌శ్న‌ల‌కు స్పందించ‌లేదు. అస‌లు ఆ ప్ర‌శ్న‌ల‌ను ఆమె ప‌ట్టించుకోలేదు. నిజంగా ఆమె ల‌వ్‌లో లేక‌పోతే అలా ఫ్యాన్స్ అడిగితే ఆ వార్త‌ల‌ను ఖండించాలి. కానీ ఆమె అలా చేయ‌లేదు. అస‌లు ఆ ప్ర‌శ్న‌ల‌ను ఆమె ప‌ట్టించుకోలేదు. దీంతో అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. ఈమె స‌ద‌రు యంగ్ హీరోతో ప్రేమ‌లో ఉన్న‌ది నిజ‌మే కాబోలునని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై రానున్న రోజుల్లో అయినా ఈ బ్యూటీ స్ప‌ష్ట‌త ఇస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment