Jio 5G Phone : 5జి ఫోన్‌ను చ‌వ‌క ధ‌ర‌కే విడుద‌ల చేయనున్న జియో..? లీకైన ఫీచ‌ర్ల వివ‌రాలు..?

January 26, 2022 3:42 PM

Jio 5G Phone : దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం టెలికాం కంపెనీలు వినియోగ‌దారుల‌కు 5జి సేవ‌లను అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో భాగంగానే ప్ర‌స్తుతం మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. 5జి సేవ‌ల‌ను అందించేందుకు అవ‌స‌ర‌మైన నెట్‌వ‌ర్క్‌ల‌ను నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే దేశంలో టెలికాం కంపెనీలు 5జి సేవ‌ల‌ను ప్రారంభించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. ఇక రిల‌య‌న్స్ జియో ఈ విష‌యంలో కాస్త ముందే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Jio 5G Phone may be launched very soon at cheap price

ఇప్ప‌టికే అనేక న‌గరాల్లో జియో 5జి సేవ‌ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తోంది. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు 5జి సేవ‌ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా జియో పావులు క‌దుపుతోంది. అందుకు అవ‌స‌ర‌మైన నెట్‌వ‌ర్క్‌ను కూడా నిర్మించుకుంటోంది. దేశంలో మొద‌ట 13 న‌గరాల్లో జియో త‌న 5జి సేవ‌ల‌ను అందిస్తుంద‌ని తెలుస్తోంది. ఇక 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌డంతోపాటు అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ఓ ఫోన్‌ను జియో లాంచ్ చేస్తుంద‌ని కూడా స‌మాచారం అందుతోంది.

జియో లాంచ్ చేస్తుంద‌ని భావిస్తున్న 5జి ఫోన్ తాలూకు ఫీచ‌ర్ల వివ‌రాలు ప్ర‌స్తుతం నెట్‌లో లీక‌య్యాయి. వాటి ప్ర‌కారం.. జియో 5జి ఫోన్‌లో.. స్నాప్‌డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్‌, 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 13, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉండ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను రూ.10వేల లోపు ధ‌ర‌కే అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే జియో లాంచ్ చేయ‌నున్న 5జి ఫోన్‌కు చెందిన మరిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఒకేసారి 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌డంతోపాటు ఈ ఫోన్‌ను కూడా లాంచ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment