Jio : అత్యంత చ‌వకైన కొత్త జియో ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్.. దీపావళి రోజు క‌న్‌ఫాం.. రెడీగా ఉండండి..!

October 27, 2021 6:28 PM

Jio : భారత టెలికాం రంగంలో జియో నెట్‌వ‌ర్క్ సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలోనే జియో మ‌రో కొత్త సంచ‌ల‌నానికి తెర‌తీయ‌నుంది. అత్యంత చ‌వ‌క ధ‌ర‌కే ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఆ ఫోన్ ను లాంచ్ చేయనున్న‌ట్లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడీ ఫోన్ లాంచ్ తేదీని క‌న్‌ఫాం చేశారు.

Jio to launch most affordable jio phone next on diwali confirmed

జియో ఫోన్ నెక్ట్స్‌ను గ‌త వినాయ‌క చ‌వితి రోజునే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్ ల కొర‌త కార‌ణంగా దీపావ‌ళికి వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫోన్ విడుద‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా వినియోగ‌దారులు ఎదురు చూస్తున్నారు. అయితే గూగుల్ భాగ‌స్వామ్యంతో ఈ ఫోన్‌ను జియో రూపొందించింది క‌నుక గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ఈ ఫోన్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఫోన్‌ను దీపావ‌ళి రోజున ఆవిష్క‌రిస్తామ‌ని క‌న్‌ఫాం చేశారు. క‌నుక దీపావ‌ళి రోజున యూజ‌ర్లు ఈ ఫోన్ కోసం రెడీగా ఉండాల్సిందే.

ఇక ఈ ఫోన్‌లో 5.5 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 215 ప్రాసెస‌ర్‌, 2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 13, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, ప్ర‌గ‌తి ఓఎస్ (ఆండ్రాయిడ్ ఆధారితం).. వంటి అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఈ ఫోన్ ధ‌ర రూ.3499గా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now