Jio : రిల‌య‌న్స్ జియో వినియోదారుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన చార్జిలు..

November 28, 2021 10:14 PM

Jio : టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. చార్జిల‌ను భారీగా పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఇత‌ర టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాలు చార్జిల‌ను పెంచాయి. దీంతో అదే బాట‌లో జియో కూడా చార్జిల‌ను పెంచిన‌ట్లు తెలిపింది. ఇక‌పై పెంచిన చార్జిలను వ‌సూలు చేయ‌నున్నారు. మొత్తం ప్లాన్ల‌పై 21.3 శాతం మేర చార్జిల‌ను పెంచిన‌ట్లు జియో తెలియ‌జేసింది.

Jio : రిల‌య‌న్స్ జియో వినియోదారుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన చార్జిలు..

కాగా జియోఫోన్ యూజ‌ర్లు బేస్ ప్లాన్‌కు గాను ఇక‌పై రూ.91 చెల్లించాలి. అలాగే ఇత‌ర వినియోగ‌దారులు బేస్ ప్లాన్ కోసం ఇక‌పై రూ.155 చెల్లించాలి. ఇందులో 300 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఇక పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జిల‌ను డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచి అమ‌లు చేస్తామ‌ని జియో ప్ర‌క‌టించింది. మ‌రిన్ని వివ‌రాల‌కు కింద ఇచ్చిన చార్ట్‌ను చూసి పెంచిన చార్జిల వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now