Janhvi Kapoor : సాయంకాలం.. బీచ్ ఒడ్డున సేద‌దీరుతున్న జాన్వీ క‌పూర్‌..!

February 26, 2022 6:58 PM

Janhvi Kapoor : శ్రీ‌దేవి కుమార్తెగా బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ మాత్రం నటిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకుంది. ఆమె న‌టించిన చిత్రాలు మ‌రీ అంత పెద్ద హిట్ కాలేదు. కానీ న‌ట‌న‌లో ఆమె మంచి మార్కులే కొట్టేసింది. ఇక జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌ర‌చూ వెకేష‌న్స్‌కు వెళ్లే ఈమె తాను దిగే ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఈమె బీచ్‌లో స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను తాజాగా షేర్ చేసింది.

Janhvi Kapoor latest beach side photos
Janhvi Kapoor

డెనిమ్ ప్యాంట్‌, వైట్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన జాన్వీ బీచ్ ఒడ్డున విహ‌రిస్తున్న ఫొటోల‌ను షేర్ చేసింది. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ కు ప‌రిచ‌యం కానుంది. ఇన్ని రోజులూ ఈ విష‌యంపై అనేక వార్త‌లు పుకార్లుగా ప్ర‌చారం అయ్యాయి. కానీ ఆమె తండ్రి బోనీ క‌పూర్ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుంద‌ని.. ఆమె ఎన్‌టీఆర్ సినిమాలో న‌టిస్తుంద‌ని చెప్పారు.

కాగా గ‌తంలో ఒక‌సారి శ్రీ‌దేవి ఓ తెలుగు మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ అదే విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌న కుమార్తె జాన్వీని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ఉంద‌ని.. అయితే ఆమె తొలి తెలుగు మూవీని ఎన్‌టీఆర్‌తో చేయాల‌ని ఆశిస్తున్నాన‌ని తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె కోరినట్లుగానే జాన్వీ త్వ‌ర‌లో ఎన్‌టీఆర్ సినిమాలో న‌టించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment