బుధవారం, జూలై 22, 2026
వార్తలు

Jacqueline Fernandez : జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఫొటోలు లీక్‌.. మళ్లీ కష్టాలు తప్పేలా లేవు..?

Jacqueline Fernandez : శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. సుమారుగా 14 మందిని మోసం చేసి రూ.200 కోట్లు కొల్ల‌గొట్టాడ‌ని…

Jacqueline Fernandez : జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఫొటోలు లీక్‌.. మళ్లీ కష్టాలు తప్పేలా లేవు..?

Jacqueline Fernandez : శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. సుమారుగా 14 మందిని మోసం చేసి రూ.200 కోట్లు కొల్ల‌గొట్టాడ‌ని సుకేష్‌ చంద్రశేఖర్‌పై అభియోగం ఉండ‌గా, ఇప్పుడు అత‌నితో చాలా స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఆమె మళ్లీ చిక్కుల్లో పడ్డట్టే.. అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Jacqueline Fernandez : జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఫొటోలు లీక్‌.. మళ్లీ కష్టాలు తప్పేలా లేవు..?
Jacqueline Fernandez

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో విచారణకు గాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ పలు మార్లు జాక్వెలిన్ కు నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే విచారణకు హాజరైంది.

Jacqueline Fernandez : జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఫొటోలు లీక్‌.. మళ్లీ కష్టాలు తప్పేలా లేవు..?
Jacqueline Fernandez

మిగిలిన సందర్భాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సాకుగా చెబుతూ డుమ్మా కొట్టింది. అయితే ఈడీ మాత్రం సుఖేష్‌కి ఏయే సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి, వారితో సుఖేష్ ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నాడు అనే కోణంలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ముందుగా సుఖేష్ తో జాక్వెలిన్, నోరా ఫతేహి లాంటి సెలెబ్రిటీలు రిలేషన్ కొనసాగించినట్లు తెలుస్తోంది. సుఖేష్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సుఖేష్.. జాక్వెలిన్‌ను చెన్నైలో దాదాపు నాలుగుసార్లు కలిశాడని, అంతేకాకుండా జాక్వెలిన్‌కు ప్రైవేటు జెట్‌ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోల‌తో జాక్వెలిన్‌కి క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఈ అమ్మ‌డు ప‌వ‌న్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తుంద‌ని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి