మంగళవారం, జూలై 21, 2026
క్రైమ్‌

Jaqueline Fernandez : దేశం విడిచి వెళ్లాల‌నుకున్న జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌.. అడ్డుకున్న పోలీసులు..

Jaqueline Fernandez : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌కు క‌ష్టాలు ఇప్ప‌ట్లో త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే రూ.200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో చిక్కుకున్న ఈమె పేరు త‌ర‌చూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఇక తాజాగా దేశం విడిచిపెట్టి…

Jaqueline Fernandez : దేశం విడిచి వెళ్లాల‌నుకున్న జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌.. అడ్డుకున్న పోలీసులు..

Jaqueline Fernandez : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌కు క‌ష్టాలు ఇప్ప‌ట్లో త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే రూ.200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో చిక్కుకున్న ఈమె పేరు త‌ర‌చూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఇక తాజాగా దేశం విడిచిపెట్టి వెళ్లాల‌నుకున్న ఈమెను ముంబైలో పోలీసులు అడ్డుకున్నారు.

Jaqueline Fernandez stopped at mumbai airport by police

రూ.200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో న‌టి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్ర‌శేఖ‌ర్‌తో క‌లిసి ఈమె గ‌తంలో దిగిన సెల్ఫీలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఈమె పేరు బాగా వినిపించింది. దీంతో ఈమె చిక్కుల్లో ప‌డింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహిని, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ను విచార‌ణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే జాక్వెలైన్ ఫెర్నాండెజ్ దేశం విడిచిపెట్టి వెళ్తున్న నేప‌థ్యంలో ముంబైలో ఈమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఈమెను పోలీసులు విచారిస్తున్నారు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి