ఒకే ఒక్క కాల్‌తో 900 మంది ఉద్యోగుల‌ను తీసేసిన సీఈవో..!

ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. అంతా బాగానే ఉంద‌నుకుంటున్న నేప‌థ్యంలో క‌రోనా ఒమిక్రాన్ రూపంలో విల‌య తాండవం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికీ ఇంకా నష్టాల్లోనే ఉన్న అనేక కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన సీఈవో ఒకే ఒక్క కాల్‌తో ఏకంగా 900 మంది ఉద్యోగుల‌ను త‌మ కంపెనీ నుంచి తీసేశాడు. వివ‌రాల్లోకి వెళితే..

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బెట‌ర్ డాట్ కామ్ అనే కంపెనీకి భార‌త సంత‌తికి చెందిన విశాల్ గార్గ్ సీఈవోగా ప‌నిచేస్తున్నాడు. అయితే ఇది వ‌ర‌కే కొంత మందిని పెద్ద ఎత్తున ఈయ‌న తీసేశాడు. తాజాగా మ‌రో 900 మందిని తీసేస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ క్ర‌మంలోనే అంత మందితోనూ ఒకే ఒక్క జూమ్ వీడియో కాల్ లో మాట్లాడి.. వాళ్ల‌ను తీసేస్తున్న‌ట్లు అప్ప‌టిక‌ప్పుడే తెలిపాడు.

కంపెనీ న‌ష్టాల్లో ఉంద‌ని, అందువ‌ల్ల ప్ర‌ద‌ర్శ‌న స‌రిగ్గా లేని ఉద్యోగుల‌ను తీసేయ‌క త‌ప్ప‌డం లేద‌ని, ఎంతో ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, ఇలా ఉద్యోగుల‌ను తీసేయ‌డం ఇది రెండోసార‌ని, త‌న‌కు ఈ విధంగా చేయ‌డం న‌చ్చ‌డం లేద‌ని, అయిన‌ప్ప‌టికీ తీసేయ‌క త‌ప్ప‌డం లేద‌ని తెలిపాడు. నాతో కాల్‌లో ఉన్న మీ 900 మంది ఉద్యోగులు దుర‌దృష్ట‌వంతులు అని అన్నాడు. ఈ క్ర‌మంలో తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కాగా.. కొంద‌రు ఆ సీఈవోను విమ‌ర్శిస్తున్నారు.

ఉద్యోగుల‌ను తీసేయ‌డం క‌రెక్టే కానీ.. మ‌రీ ఇలా ఉన్నప‌ళంగా తీసేస్తే ఎలా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఆ కంపెనీ ఉద్యోగుల‌ను తీసేసిన‌ప్ప‌టికీ 2 నెల‌ల జీతం, ఇత‌ర బెనిఫిట్స్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM