Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేయనుంది. ఈ మేరకు అమెజాన్ తాజాగా నిర్ణయం తీసుకుంది. తమ వద్ద కష్టపడి పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి జీతం పెంచడం ద్వారా కంపెనీ మారకుండా చూసేందుకు గాను అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో సుమారుగా 16 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తుండగా.. వీరిలో కొందరికి నెలవారీ వేతనాలను అందిస్తున్నారు. ఇక కొందరు పనిచేసిన గంటలకు తగినట్లుగా వేతనాలను పొందుతున్నారు. అయితే వీరిలో ఎవరెవరికి జీతాలు పెరగనున్నాయనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఉద్యోగులు, సిబ్బంది పనితీరు ఆధారంగా అందరికీ జీతాలు పెంచడంతోపాటు కొందరికి ప్రమోషన్స్‌ను కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇక వేతనాల పెంపుతోపాటు అత్యంత ఎక్కువ ప్రదర్శన చేసిన వారికి తమ కంపెనీకి చెందిన షేర్స్‌ను కూడా ఇవ్వాలని.. అమెజాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో పనిచేస్తున్న అమెజాన్ సిబ్బంది వేతనం గంటకు రూ.1340గా ఉంది. కొందరు గంటల ఆధారంగా పనిచేస్తారు. వారికి ఈ వేతనం చెల్లిస్తున్నారు.
గత వారం రోజుల కిందట అమెజాన్ షేర్ల విలువ కూడా బాగానే పెరిగింది. దీంతో అమెజాన్ కంపెనీ విలువ ప్రస్తుతం 1.6 ట్రిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.1,41,82060 కోట్లు) చేరుకుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…