Sumanth : హీరో సుమంత్ నటించిన పలు చిత్రాలు అప్పట్లో హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సుమంత్ ఈ మధ్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయినప్పటికీ హిట్ సాధించలేకపోతున్నారు. ఇక ఆయన మళ్లీ మొదలైంది అనే మూవీలో నటించగా.. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన జీ5 ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
కాగా మళ్లీ మొదలైంది అనే మూవీ విడాకుల కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం. దీంతో ఆయనకు విడాకుల మీదనే ప్రశ్నలు వచ్చాయి. అయితే వాటికి సుమంత్ స్పందించక తప్పలేదు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. అది సర్వ సాధారణం అయిపోయింది. కనుక ఏ జంట అయినా విడాకులు తీసుకుంటున్నారంటే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. సెలబ్రిటీల విడాకులు కూడా కామన్ అయిపోయాయి.. అని సుమంత్ అన్నారు.
ఇక ఒకసారి విడాకులు తీసుకున్నవారు రెండో వివాహం చేసుకుంటే విడిపోయే అవకాశాలు చాలా తక్కువని, కనుక రెండోసారి వివాహం చేసుకోవచ్చని సుమంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మళ్లీ మొదలైంది సినిమాలోనూ ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది కనుక సుమంత్‌కు విడాకులపై ప్రశ్నలు రాగా.. ఆయన పై విధంగా స్పందించారు. కొన్నేళ్ల కిందట ఆయన నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని విడాకులు ఇచ్చారు. అయితే ఆయనను విడాకుల మీదనే ప్రశ్నలు అడగ్గా.. అందుకు ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా.. అన్నట్లుగా స్పందించారు. దీంతో సుమంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…