క్రికెట్

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్న సంజు శాంసన్. Photo Credit: Chennai Super Kings/X.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజు శాంస‌న్ (Sanju Samson) ఆ టోర్నీలో మ‌హేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాల‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపాడు. సోమ‌వారం (మార్చి 16, 2026) సంజు మీడియాతో మాట్లాడుతూ మ‌హి భాయ్ (ధోనీ)తో తాను ఫోన్‌లో మాట్లాడాన‌ని, కొన్ని సంద‌ర్భాల్లో ధోనీని క‌లిశాన‌ని తెలిపాడు. కానీ ఒకే జ‌ట్టులో క‌ల‌సి ఆడ‌డం త‌న‌కు గొప్ప అనుభ‌వం అవుతుంద‌ని, ధోనీ నుంచి నేర్చుకునే మంచి అవ‌కాశం ల‌భించ‌నుంద‌ని అన్నాడు. అయితే ఈసారి టోర్నీలో తాను సీఎస్కేకు ఆడుతున్నాడు క‌నుక త‌న పాత జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (Rajasthan Royals)తో త‌ల‌ప‌డాల్సి వ‌స్తే అది భావోద్వేగాల‌ను క‌లిగించ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

మైదానంలో భావోద్వేగాల‌కు తావు లేదు: స‌ంజు

ఐపీఎల్‌లో సంజు శాంస‌న్ చాలా కాలం పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ఆడిన విష‌యం తెలిసిందే. మార్చి 30, 2026న గువాహ‌టిలో జ‌ర‌గ‌నున్న త‌మ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే సంజు ఈసారి సీఎస్‌కేకు ఆడనున్నాడు. క‌నుక ఆ మ్యాచ్‌లో భావోద్వేగానికి గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని సంజు అన్నాడు. ఇక సాంకేతికంగా చూస్తే ఆ మ్యాచ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు హోం మ్యాచ్ అయిన‌ప్ప‌టికీ వారికి వ్య‌తిరేకంగా ఇంకో జ‌ట్టులో ఆడ‌డం వ‌ల్ల భావోద్వేగాలు క‌లిగే అవకాశం ఉంద‌ని అన్నాడు. అయితే మైదానంలో భావోద్వేగాలు త‌న ఆట‌పై ప్ర‌భావం చూపించ‌కుండా చూసుకుంటాన‌ని తెలిపాడు.

సీఎస్‌కేకు ఆడ‌డం సంతోషాన్నిస్తోంది..

చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడబోతున్నందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నాన‌ని సంజు శాంస‌న్ పేర్కొన్నాడు. అభిమానుల నుంచి వ‌స్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు తాను ఎంతో కృత‌జ్ఞుడిన‌ని అన్నాడు. ఇప్పుడు తొలిసారిగా త‌న పాత జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు వ్య‌తిరేకంగా ఆడ‌బోతున్నాన‌ని, కానీ మైదానంలో భావోద్వేగాల‌ను తాను ప్ర‌భావితం కానివ్వ‌న‌ని, త‌న స‌మ‌యం ఆ జ‌ట్టులో ముగిసింద‌ని భావించి తాను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను వీడాన‌ని తెలిపాడు. అయితే ఇప్పుడు వారిని ఎదుర్కొన్నా కూడా తాను త‌న ఉత్త‌మ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు ముందు త‌న ప్ర‌ద‌ర్శ‌న అంత‌గా బాగాలేక‌పోవ‌డంతో కొంత ఆత్మ ప‌రిశీల‌న చేసుకున్న‌ట్లు వివ‌రించాడు. కానీ ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించ‌డం త‌న‌కు ఒక ఆధ్యాత్మిక క్ష‌ణంలా అనిపించింద‌ని తెలిపాడు.

స‌చిన్ ఇచ్చిన స‌ల‌హాల‌ను మ‌రిచిపోలేను..

ప్ర‌పంచ‌క‌ప్ ఆడేందుకు ఇంటి నుంచి బ‌య‌లు దేరిన స‌మ‌యంలో త‌న‌కు క‌ప్ సాధిస్తామ‌ని అంత‌గా విశ్వాసం లేద‌ని సంజు తెలిపాడు. కానీ ప్ర‌పంచం మ‌రోలా నిర్ణ‌యించింద‌ని, తాను బాగా ఆడాన‌ని, అభిమానుల నుంచి వ‌చ్చిన స్పంద‌న కూడా అద్భుతంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు. కాగా భార‌త జ‌ట్టుకు మూడో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను అందించ‌డంలో సంజు శాంస‌న్ కీల‌క పాత్ర పోషించాడు. చివ‌రి మూడు మ్యాచ్‌ల‌లో అత‌ను 89, 97 నాటౌట్‌, 89 ప‌రుగుల‌ను సాధించాడు. ఆ మూడు ఇన్నింగ్స్‌ల‌లో సూప‌ర్ 8 ద‌శ‌లో వెస్టిండీస్‌పై చేసిన 97 నాటౌట్ ప‌రుగుల ఇన్నింగ్స్‌ను త‌న ముఖ్య‌మైన ఇన్నింగ్స్‌గా అత‌ను అభివ‌ర్ణించాడు. ఇక టోర్న‌మెంట్ స‌మ‌యంలో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండుల్క‌ర్ అందించిన స‌ల‌హాల‌తోనే తాను అంత‌లా రాణించాన‌ని, ఆయ‌న స‌ల‌హాల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేన‌ని సంజు స్ప‌ష్టం చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM