భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఫ్యాన్స్ ఇంకా ఆ విజయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. సొంత గడ్డపై జరిగిన టోర్నీలో సత్తా చాటిన టీమిండియా సభ్యులకు ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్, బుమ్రా, శివం దూబె వంటి ప్లేయర్ల పేర్లు మారుమోగిపోతున్నాయి. అయితే 2024లోనూ భారత్ టీ20 ప్రపంచకప్‌ను సాధించిన విషయం తెలిసిందే. కానీ 2026 కన్నా 2024 విజయమే చాలా ప్రత్యేకమని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. అది ఎందుకో వారు కారణాలను కూడా వివరిస్తున్నారు.
2023లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ సొంత గడ్డపై జరగ్గా భారత్ ఫైనల్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా దూసుకువచ్చింది. కానీ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఆ ఓటమిని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ ఓటమి అనంతరం కాస్త తేరుకునేలా రోహిత్ శర్మ నాయకత్వంలో మరుసటి ఏడాది వెస్టిండీస్‌లో 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ మాత్రం భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఎంతో ఊరటను అందించింది. 2007లో టీ20 ప్రపంచకప్‌ను సాధించిన అనంతరం 17 ఏళ్ల తరువాత మళ్లీ ట్రోఫీ దక్కడంతో 2024 విజయం చాలా ప్రత్యేకమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక 2024తో పోల్చితే 2026 విజయం ఇంకా ప్రత్యేకమని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.
2026 టీ20 ప్రపంచకప్‌ను సొంత గడ్డపై గెలవడం ద్వారా టీమిండియా అనేక రికార్డులను బ్రేక్ చేసింది. ఫైనల్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలవడమే కాకుండా, సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్‌లను గెలిచిన జట్టుగా కూడా నిలిచింది. ఇక అహ్మదాబాద్ స్టేడియం అంటేనే భయపడే పరిస్థితిలో ఫైనల్‌లో కివీస్‌తో భారత్ అద్భుతంగా ఆడింది. దీంతో ఆ స్టేడియం పీడ కూడా విరగడైందని ఫ్యాన్స్ అంటున్నారు. కనుక ఆయా అంశాలను బట్టి చూస్తే ఈ ట్రోఫీ విజయం కూడా ప్రత్యేకమే అని అంటున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచిన ఉత్సాహంలో ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో వారు ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం తొలి 20 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు సన్ రైజర్స్‌ను ఢీకొట్టనుంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…