క్రికెట్

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అక్షయ్ కుమార్, అభిషేక్ శర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ. Photo Credit: India Today/X.

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు బహుమతిగా అందించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు రికార్డు విజయం అందించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 21 బంతుల్లో అద్భుతంగా 52 పరుగులు సాధించాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ కార్యక్రమంలో ఈ ఇద్దరూ ఒకే వేదికపై పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన కోసం ఒక బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అభిషేక్‌ను కోరాడు. అయితే అందుకు ప్రతిగా ప్రపంచకప్ సమయంలో ఉపయోగించిన బ్యాట్‌ను నేనే మీకు బహుమతిగా ఇస్తానని క్రికెటర్ తెలిపాడు. వెంటనే అక్షయ్ కుమార్ అభిషేక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

అభిషేక్‌ను ప్ర‌శంసించిన సంజు..

కాగా భారత జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన ఓపెనింగ్ భాగస్వామి అభిషేక్ శర్మను ప్రశంసించాడు. త‌మ‌ భాగస్వామ్యం చాలా సహజంగా, సమతుల్యంగా సాగుతుందని పేర్కొన్నాడు. తమ జోడీని ఫైర్ అండ్ ఫైర్ గా అభివర్ణించాడు. ఇద్దర‌మూ వరుసగా దాడిని ముందుకు నడిపించే విధంగా ఆడతామని చెప్పారు. కేరళ-పంజాబ్ స్నేహం తమ మధ్య ఉన్న అవగాహనకు బలంగా నిలుస్తుందని సంజూ శాంసన్ తెలిపాడు. అభిషేక్ ధైర్యం, స్థిరమైన స్వభావాన్ని సంజు ప్రశంసించాడు. మైదానంలోనూ, మైదానం బయట కూడా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తున్నానని అన్నాడు.

ఇక ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై దూకుడుగా ఆడారు. ఓపెనింగ్ భాగస్వామ్యంగా ఇద్దరూ కలిసి 98 పరుగులు జోడించి పవర్‌ప్లేలో భారత్‌కు అద్భుత ఆరంభాన్ని అందించారు. వారి ఆ అద్భుత ప్రారంభం ఫైనల్‌లో భారత్ 255 పరుగుల భారీ స్కోర్ సాధించడానికి దోహదపడింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM