రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న రిలీజ్ కానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌లను రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో నటించిన నటీనటుల లుక్‌ను రివీల్ చేసింది. ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ మార్చి 18, 2026న కేవలం థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుందని రష్మిక తన పోస్టులో తెలిపింది. కాగా విజయ్ దేవరకొండతో పెళ్లి జరిగిన అనంతరం నిర్వహించిన ఆమె రిసెప్షన్‌కు కాక్‌టెయిల్ 2 చిత్ర బృందం కూడా వచ్చింది.
ఉదయపూర్‌లో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత రష్మిక మందన్న హైదరాబాద్‌లో జరిగిన తమ వివాహ రిసెప్షన్‌కు కాక్‌టెయిల్ 2 బృందాన్ని ఆహ్వానించింది. మార్చి 4, 2026న జరిగిన ఆ స్టార్ స్టడెడ్ వేడుకకు కృతి సనన్, హోమీ అదజానియా, మ్యాడాక్ ఫిల్మ్స్ అధిపతి దినేష్ విజన్, ఆయన భార్య ప్రమితా తన్వర్ హాజరయ్యారు. కాక్‌టెయిల్ 2 సినిమా షూటింగ్‌ను నటీనటులు, సిబ్బంది ఈ ఏడాది జనవరిలో పూర్తిచేశారు. ఆ సమయంలో సినిమా ర్యాప్ పార్టీ నుంచి కొన్ని సరదా ఫోటోలను హోమీ అదజానియా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
2024లో విడుదలైన తేరీ బాతోన్ మేన్ ఐసా ఉల్ఝా జియా తర్వాత షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి పనిచేస్తున్న రెండో చిత్రం కాక్ టెయిల్ 2 కాగా హోమీ అదజానియా 2012లో విడుదలైన కాక్‌టెయిల్ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…