పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా ప్రకటించబడడంతో ఈ వివాదం చెలరేగింది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మాజ్ సదాకత్, సల్మాన్ అలీ ఆఘా వరుసగా 75, 64 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు పోటీ పడే స్కోరు అందించారు. అయితే ఈ వివాదం పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో చోటుచేసుకుంది. దీంతో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ పై చర్చలు మొదలయ్యాయి. ఈ ఘటన ఆ ఓవర్ నాలుగో బంతి సమయంలో జరిగింది. మొహమ్మద్ రిజ్వాన్ బౌలర్ కుడివైపు బంతిని ఆడగా, సల్మాన్ క్రీజ్ బయటకు వచ్చాడు. అదే సమయంలో బంతిని అందుకోవడానికి ప్రయత్నించిన మెహిదీ హసన్ మిరాజ్‌తో సల్మాన్ ఢీకొన్నాడు.
బంతి డెడ్ అయిందని భావించిన సల్మాన్ దాన్ని తీసుకుని మిరాజ్‌కు ఇవ్వడానికి వంగి బంతిని ఎత్తుకున్నాడు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మిరాజ్ వెంటనే బంతిని పట్టుకుని వికెట్లపై ఉన్న బైల్స్‌ను తొలగించాడు. ఆ సమయంలో సల్మాన్ క్రీజ్ బయట ఉన్నాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన సల్మాన్ చూస్తుండగానే మైదాన అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు పంపించారు. థర్డ్ అంపైర్ పరిశీలించి రన్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన సల్మాన్ మిరాజ్‌తో కొద్దిసేపు వాగ్వాదం చేశాడు. అనంతరం కోపంగా మైదానం విడిచిపెడుతూ తన హెల్మెట్, గ్లోవ్స్‌ను నేలపైకి విసిరేశాడు. ఈ సమయంలో అతని సహచర ఆటగాళ్లు వచ్చి అతడిని శాంతింపజేశారు. తరువాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా మిరాజ్‌ను సమాధానపర్చే ప్రయత్నం చేసినట్లు కనిపించింది.
మ్యాచ్ విషయానికి వస్తే, పాకిస్తాన్ జట్టు చేసిన 274 పరుగుల స్కోరు ప్రధానంగా మాజ్ సదాకత్ (75), సల్మాన్ ఆఘా (64) అద్భుత ఇన్నింగ్స్‌లతో నిర్మితమైంది. వీరితో పాటు మొహమ్మద్ రిజ్వాన్ (44), షాహిబ్‌జాదా ఫర్హాన్ (31) కూడా ఉపయోగకరమైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ తరఫున రిషాద్ హొస్సేన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా, జట్టు కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…