Sumanth : కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చాక‌.. విడాకుల విష‌యంపై తాజాగా స్పందించిన సుమంత్..!

February 9, 2022 7:14 PM

Sumanth : హీరో సుమంత్ న‌టించిన ప‌లు చిత్రాలు అప్ప‌ట్లో హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే సుమంత్ ఈ మ‌ధ్య మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ హిట్ సాధించ‌లేక‌పోతున్నారు. ఇక ఆయ‌న మ‌ళ్లీ మొద‌లైంది అనే మూవీలో న‌టించ‌గా.. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన జీ5 ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయ‌న ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ప‌లు చానల్స్‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

Sumanth talked about divorce issue
Sumanth

కాగా మ‌ళ్లీ మొద‌లైంది అనే మూవీ విడాకుల కాన్సెప్ట్‌తో వ‌చ్చిన చిత్రం. దీంతో ఆయ‌న‌కు విడాకుల మీద‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయితే వాటికి సుమంత్ స్పందించ‌క త‌ప్ప‌లేదు. ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. అది స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. క‌నుక ఏ జంట అయినా విడాకులు తీసుకుంటున్నారంటే ఆ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. సెల‌బ్రిటీల విడాకులు కూడా కామ‌న్ అయిపోయాయి.. అని సుమంత్ అన్నారు.

ఇక ఒక‌సారి విడాకులు తీసుకున్న‌వారు రెండో వివాహం చేసుకుంటే విడిపోయే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని, క‌నుక రెండోసారి వివాహం చేసుకోవ‌చ్చ‌ని సుమంత్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలోనూ ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది క‌నుక సుమంత్‌కు విడాకుల‌పై ప్ర‌శ్న‌లు రాగా.. ఆయ‌న పై విధంగా స్పందించారు. కొన్నేళ్ల కింద‌ట ఆయ‌న న‌టి కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని విడాకులు ఇచ్చారు. అయితే ఆయ‌న‌ను విడాకుల మీద‌నే ప్ర‌శ్న‌లు అడ‌గ్గా.. అందుకు ఆయ‌న క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా.. అన్న‌ట్లుగా స్పందించారు. దీంతో సుమంత్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment