ఆదివారం, జూన్ 28, 2026
వార్తలు

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట‌రైన ఫ్యామిలీ.. క‌న్నీళ్ల‌తో త‌డిసిముద్దైన హౌజ్‌..

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 8 మంది స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. వారి మ‌ధ్య ఆస‌క్తిక‌ర టాస్క్‌లు న‌డుస్తున్నాయి. ఇక మూడు…

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట‌రైన ఫ్యామిలీ.. క‌న్నీళ్ల‌తో త‌డిసిముద్దైన హౌజ్‌..

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 8 మంది స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. వారి మ‌ధ్య ఆస‌క్తిక‌ర టాస్క్‌లు న‌డుస్తున్నాయి. ఇక మూడు వారాలు మాత్ర‌మే ఫైన‌ల్‌కి టైం ఉండ‌డంతో ఇక ఫ్యామిలీని ఇంట్లోకి ప్ర‌వేశ‌పెట్టారు. అయితే గ‌తంలో వైర‌స్ ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా గాజు అద్దంలో నుంచే చూసి మాట్లాడేలా షరతులు విధించారు.

family members entered into bigg boss house

ఈసారి వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో హౌస్‌మేట్స్‌ కుటుంబ సభ్యులను మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి నేరుగా ఇంట్లోకి పంపించారు. బీబీ ఎక్స్‌ప్రెస్‌ గేమ్‌ ఆడుతున్న కంటెస్టెంట్లను ఫ్రీజ్‌ లో ఉంచి కుటుంబ స‌భ్యుల‌ని లోప‌ల‌కి ప్ర‌వేశ‌పెట్టారు. ముందుగా కాజ‌ల్ భ‌ర్త‌, కూతురు ఎంట‌ర్ అయ్యారు.

కాజల్‌ గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు. ‘మీ మమ్మీని ఎవరైనా నామినేట్‌ చేస్తే కోపమొస్తుందా?’ అని శ్రీరామ్‌ అడగ్గా అందుకు కాజల్‌ కూతురు అవునంటూ వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. తర్వాత శ్రీరామ్‌ కోసం ఆమె సోదరిని పంపించారు. షణ్ముఖ్‌ తనకోసం ఎవరిని పంపిస్తున్నారో ముందే చెప్తే తన మైండ్‌ను ప్రిపేర్‌ చేసుకుంటానని కెమెరాకు విన్నవించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి