Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి స‌ర్వం సిద్ధం..!

February 8, 2022 8:54 AM

Bigg Boss OTT Telugu : తెలుగు బుల్లితెరపై అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధించిన షోల‌లో బిగ్ బాస్ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. మొన్నీ మ‌ధ్య సీజ‌న్ 5 ఆసక్తిక‌రంగా ముగిసింది. ఈ క్ర‌మంలోనే షోకు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి నిర్వాహ‌కులు బిగ్ బాస్ ఓటీటీకి ప్లాన్ చేశారు. దీనిపై నాగార్జున గ‌తంలోనే అధికారికంగా వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ నెలాఖ‌రులో ఈ షో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

Bigg Boss OTT Telugu is all ready for start
Bigg Boss OTT Telugu

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోను ఈ నెల 26వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ షోకు గాను ఇప్ప‌టికే కంటెస్టెంట్ల‌ను కూడా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. వారిని మ‌రో నాలుగైదు రోజుల్లో క్వారంటైన్‌కు కూడా పంపిస్తార‌ని స‌మాచారం అందుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ షో కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో కేవ‌లం ఓటీటీలో మాత్ర‌మే ప్ర‌సారం కానుంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ షోను ప్ర‌సారం చేస్తారు. రోజుకు 24 గంట‌లూ ఈ షోను లైవ్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు. తెలుగులో ఒక షోను ఇలా రోజుకు 24 గంట‌లూ లైవ్‌లో ప్ర‌సారం చేయ‌డం ఇదే తొలిసార‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఈ షో ఎలా ఉంటుందా.. అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ షో 84 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. నాగార్జున‌నే దీనికి మ‌ళ్లీ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now