సోమవారం, జూలై 6, 2026
వార్తలు

Evaru Meelo Koteeshwarulu : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో రూ.1 కోటి గెలిస్తే.. ప‌న్నులు పోను చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా ?

Evaru Meelo Koteeshwarulu : ఎవరు మీలో కోటీశ్వ‌రులు అనేది మ‌న తెలివికి, జ‌న‌ర‌ల్ నాలెడ్జికి సంబంధించిన షో. ఇక బిగ్‌బాస్ కూడా ఇలాంటిదే. కానీ అందులో సామాన్యుల‌కు మాత్రం అవ‌కాశం ద‌క్క‌దు. ఏదో ఒక రంగంలో స్టార్…

Evaru Meelo Koteeshwarulu : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో రూ.1 కోటి గెలిస్తే.. ప‌న్నులు పోను చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా ?

Evaru Meelo Koteeshwarulu if somebody wins rs 1 crore how much he will get after tax deduction

Evaru Meelo Koteeshwarulu : ఎవరు మీలో కోటీశ్వ‌రులు అనేది మ‌న తెలివికి, జ‌న‌ర‌ల్ నాలెడ్జికి సంబంధించిన షో. ఇక బిగ్‌బాస్ కూడా ఇలాంటిదే. కానీ అందులో సామాన్యుల‌కు మాత్రం అవ‌కాశం ద‌క్క‌దు. ఏదో ఒక రంగంలో స్టార్ అయి ఉన్నా.. కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్నా.. బిగ్ బాస్ వంటి షోల‌లో పాల్గొనే అవ‌కాశం ల‌భిస్తుంది. అయితే ఏ షో అయినా స‌రే.. వాటిల్లో రూ.1 కోటి గెలిచార‌నుకుందాం. ప‌న్నులు పోను చేతికి ఎంత మొత్తం వ‌స్తుందంటే..?

 

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు, బిగ్ బాస్, ఇత‌ర టీవీ షోల‌తోపాటు, లాట‌రీలు, గుర్రం పందాలు, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటిలో గెలుచుకున్న ప్రైజ్ మ‌నీకి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 56(2)(ib) ప్ర‌కారం 30 శాతం ట్యాక్స్ క‌ట్టాలి. ఇక ఆ 30 శాతం మొత్తం మీద మ‌ళ్లీ 4 శాతం సెస్ ఉంటుంది. అంటే అది.. 1.2 శాతం అవుతుంది. ఇక 30+1.2 = 31.2 అవుతుంది. ఆ మొత్తం ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంది.

ఈ క్ర‌మంలో ప్రైజ్ మ‌నీ న‌గ‌దు రూపంలో వ‌స్తే.. అందులోంచి TDS – Tax Deduction at Source క‌ట్ చేసి ఇస్తారు. అదే గిఫ్ట్ రూపంలో వ‌స్తే.. ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టాలి. ఆ మొత్తాన్ని ఏదైనా సంస్థ‌కు విరాళం ఇస్తే.. ఎలాంటి ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టాల్సిన ప‌ని ఉండ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి