Pawan Kalyan : ఎన్టీఆర్ షోలో మ‌హేష్‌తోపాటు ప‌వ‌న్ కూడా సంద‌డి చేయ‌నున్నాడా..!

November 24, 2021 2:39 PM

Pawan Kalyan : ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షోలో ప‌లువురు సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. మ‌హేష్ బాబు కూడా హాట్ సీట్‌లో కూర్చొని గేమ్ ఆడేందుకు సిద్ధ‌మ‌య్యాడు. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ పిలిచిన తీరుతో ఇద్దరు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ షో ను స్ట్రీమింగ్ చేస్తారా.. అంటూ ఎదురు చూస్తున్నారు.

Pawan Kalyan may feature in evaru meelo koteeshwarulu show

తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యి ఎన్టీఆర్ తో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక ప్రశ్నకు వీడియో కాల్ ఫ్రెండ్ హెల్ఫ్ తీసుకుంటారట‌. దాంతో ఎన్టీఆర్ తన షో లో పవన్ కళ్యాణ్ కు కాల్ కలపడం మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆ ఎపిసోడ్ లో చూడబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్త నిజ‌మైతే అభిమానుల‌కి పూన‌కాలు రావ‌డం ఖాయం అంటున్నారు.

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు. అయితే స్పెషల్ గెస్ట్ లు వచ్చినప్పుడు మాత్రం రికార్డు స్థాయి రేటింగ్ ను నమోదు చేస్తోంది. చరణ్, ఎన్టీఆర్ ల కర్టన్ రైజర్‌ ఎపిసోడ్ ను రెండు రోజులు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు రోజులు కూడా భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్ దక్కిన విషయం తెల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now