Evaru Meelo Koteeshwarulu : పవన్‌ సినిమాల్లో ఎన్‌టీఆర్‌కు ఇష్టమైన సినిమా.. చెప్పేశారు..!

November 26, 2021 3:08 PM

Evaru Meelo Koteeshwarulu : మ‌రి కొద్ది రోజుల‌లో బుల్లితెర ఫ్యాన్స్‌కి మాంచి కిక్ దొర‌క‌బోతోంది. ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో క‌నిపించ‌నుండ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మ్యాట‌ర్‌లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో జనరంజకంగా మారి బుల్లితెర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతున్నది. ఈ షో మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, చివ‌రి గెస్ట్‌గా మ‌హేష్ బాబు హాజ‌రు కానున్నారు.

Evaru Meelo Koteeshwarulu NTR told about his favorite Pawan movie

హాట్ సీట్‌లో ఉన్న మ‌హేష్ బాబుని ఎన్టీఆర్ ఏదో ప్ర‌శ్న అడ‌గ‌గా, దానికి మ‌హేశ్ ఫోన్ ఎ ఫ్రెండ్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కాల్ చేసి త‌న స‌పోర్ట్ తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భంలో ముగ్గురు హీరోలు క‌లిసి ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్నార‌ట‌. అయితే ఇందులో ఎన్టీఆర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకి బాగా ఇష్టం అయిన సినిమా “తొలిప్రేమ” అని చెప్పడం, దానికి ప‌వ‌న్ స్ట‌న్నింగ్ రియాక్ష‌న్ ఇస్తార‌ని టాక్ నడుస్తోంది.

బిగ్‌బాస్ తొలి సీజ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రెండో బుల్లితెర ప్రోగామ్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంలో మ‌హేష్ ఎపిసోడ్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగ‌నుంద‌ని స‌మాచారం. ఆట నాది.. కోటి మీది.. అంటూ మ‌రోసారి ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో షోకు గ్లామ‌ర్‌ను తెచ్చారు.

రీసెంట్‌గా రాజా రవీంద్ర అనే పోలీస్ ఆఫీస‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని కోటి రూపాయ‌ల‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్‌ కానుంది. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now