ఆదివారం, జూలై 5, 2026
వార్తలు

Anchor Sreemukhi : టీవీ షో ఒక్క ఎపిసోడ్‌కు శ్రీముఖి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా ?

Anchor Sreemukhi : ప్రస్తుత తరుణంలో హీరోయిన్ల కన్నా యాంకర్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఏ ఈవెంట్‌కు అయినా.. ఏ షోకు అయినా సరే.. యాంకర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారు గలగలా మాట్లాడుతూ సందడి చేస్తారు. కనుక…

Anchor Sreemukhi : టీవీ షో ఒక్క ఎపిసోడ్‌కు శ్రీముఖి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా ?

Anchor Sreemukhi : ప్రస్తుత తరుణంలో హీరోయిన్ల కన్నా యాంకర్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఏ ఈవెంట్‌కు అయినా.. ఏ షోకు అయినా సరే.. యాంకర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారు గలగలా మాట్లాడుతూ సందడి చేస్తారు. కనుక హీరోయిన్ల కన్నా యాంకర్లదే ఎక్కువ హవా ఉంటుంది. ఇక అలాంటి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈమె ఓవైపు టీవీషోలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఈమెకు ఎంతో మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. సోషల్‌ మీడియాలో శ్రీముఖిని ఫాలో అయ్యేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

శ్రీముఖి ఈ మధ్య కాలంలో అనేక షోలలో సందడి చేస్తోంది. అయితే ఈ అమ్మడు తన రెమ్యునరేషన్‌ను ఇటీవల భారీగా పెంచిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈమె ఒక్క టీవీ షో ఎపిసోడ్‌ చేస్తే రూ.1.50 లక్షల వరకు తీసుకునేదట. కానీ దాన్ని రూ.50వేలు పెంచిందని సమాచారం. దీంతో ఆమె టీవీ షో ఒక్క ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అనధికారిక సమాచారమే. ఈ క్రమంలోనే శ్రీముఖి సంపాదనలోనూ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.

do you know how much Anchor Sreemukhi takes for one TV show episode
Anchor Sreemukhi

ఇక శ్రీముఖి తెలుగులో బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే ఈమెకు ఆ షో మరింత పేరు తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం ఈమె టీవీల్లో పలు షోస్‌ చేస్తోంది. సూపర్‌ మామ్‌, సూపర్‌ సింగర్‌, పటాస్‌, కామెడీ నైట్స్, జీ సరిగమప, స్టార్‌ మ్యూజిక్‌ రీలోడెడ్‌, సెలబ్రిటీ కబడ్డీ లీగ్‌, బొమ్మ అదిరింది వంటి షోలు చేస్తోంది. అలాగే 2015లో దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఈమె చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్‌ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి