గురువారం, జూన్ 11, 2026
వినోదం

Anchor Sreemukhi : గుండె ప‌గిలే ర‌హ‌స్యం బ‌య‌ట‌పెట్టిన శ్రీముఖి.. ల‌వ్‌లో చాలా సార్లు ఫెయిల‌య్యానంటూ కామెంట్

Anchor Sreemukhi : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న అందాల యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. చూడ చ‌క్క‌ని అందంతో పాటు క్యూట్ మాట‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తూ ఉంటుంది. తెలుగులో టాప్ ఫైవ్ ఫిమేల్ యాంకర్స్ లో ఒకరిగా…

Anchor Sreemukhi : గుండె ప‌గిలే ర‌హ‌స్యం బ‌య‌ట‌పెట్టిన శ్రీముఖి.. ల‌వ్‌లో చాలా సార్లు ఫెయిల‌య్యానంటూ కామెంట్

Anchor Sreemukhi : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న అందాల యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. చూడ చ‌క్క‌ని అందంతో పాటు క్యూట్ మాట‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తూ ఉంటుంది. తెలుగులో టాప్ ఫైవ్ ఫిమేల్ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తోంది.ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది.ఏ షోలో చూసిన, ఏ ఈవెంట్ లో చూసిన కూడా శ్రీముఖి పేరే వినిపిస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ టీవీ, ఓటీటీ షోలతో బిజీగా ఉంది. సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా బుల్లితెరపై మాత్రం తిరుగులేని స్టార్‌గా కొనసాగుతోంది.

బిజీ షెడ్యూల్‌లో, శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రసార ఛానెల్ ద్వారా అభిమానులతో సరదాగా గడిపింది. తన ప్రేమకథతో పాటు పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రేమలో ఎప్పుడైనా విఫలమయ్యారా అని ఓ అభిమాని శ్రీముఖిని అడిగాడు. దానికి స్పందించిన శ్రీముఖి.. తన లవ్ బ్రేకప్ విశేషాలను అభిమానులతో పంచుకుంది. ప్రేమలో చాలాసార్లు విఫలమయ్యానని చెప్పింది. పెళ్లి చేసుకుంటే యాంకరింగ్ ఆపేస్తావా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. పెళ్లయినా యాంకరింగ్ ఆపనని స్పష్టం చేసింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది. హార్ట్ బ్రేక్‌ అయ్యే ప్రేమ కథలు చాలానే ఉన్నాయనే విషయాన్ని, ఇన్నాళ్లు దాచిన రహస్యాన్ని ఆమె బయటపెట్టింది.

Anchor Sreemukhi sensational comments about her past life
Anchor Sreemukhi

మూడు పదులు దాటి నాలుగు పదుల వైపు దూసుకెళ్తుంది శ్రీముఖి. ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అడపాదడపా ఆమెకి టీవీ షోస్‌లో అలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా, తెలివిగా తప్పించుకుంటుంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం శ్రీముఖి నాలుగైదు షోస్‌కి యాంకరింగ్‌ చేస్తూ బిజీగా ఉంది. అందులో `స్టార్ మా పరివార్‌`, `మిస్టర్ అండ్‌ మిసెస్`, `సారంగ ధరియా`, అలాగే `కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌` షోలకు యాంకరింగ్‌ చేస్తూ రాణిస్తుంది. అదే సమయంలో ప్రతి వారం తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ యాంకర్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.