గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss Telugu Season 6 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 లో పాల్గొన‌నున్న సెల‌బ్రిటీలు వీరే..?

Bigg Boss Telugu Season 6 : బుల్లితెర‌పై అత్యంత స‌క్సెస్ సాధించిన షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. ఈ షో 5 సీజ‌న్లు ముగించుకుంది. త్వ‌ర‌లోనే 6వ సీజ‌న్ సైతం ప్రారంభం కానుంది. ఈ మ‌ధ్యే బిగ్…

Bigg Boss Telugu Season 6 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 లో పాల్గొన‌నున్న సెల‌బ్రిటీలు వీరే..?

Bigg Boss Telugu Season 6 : బుల్లితెర‌పై అత్యంత స‌క్సెస్ సాధించిన షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. ఈ షో 5 సీజ‌న్లు ముగించుకుంది. త్వ‌ర‌లోనే 6వ సీజ‌న్ సైతం ప్రారంభం కానుంది. ఈ మ‌ధ్యే బిగ్ బాస్ ఓటీటీని నిర్వ‌హించారు. కానీ దీన్ని ఓటీటీకే ప‌రిమితం చేశారు. టీవీలో ప్ర‌సారం చేయ‌లేదు. క‌నుక ఈ షోకు పెద్ద‌గా స్పంద‌న ల‌భించ‌లేదు. అయితే త్వ‌ర‌లో బిగ్ బాస్ సీజ‌న్ 6ను ప్రారంభించ‌నుండ‌డంతో మ‌ళ్లీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత వినోదం ల‌భ్యం కానుంది. ఇక ఈ షోకు సంబంధించిన కీల‌క అప్‌డేట్‌ను త్వ‌ర‌లోనే వెల్లడించ‌నున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6ను సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. లేదా ఆగ‌స్టు చివ‌ర్లో అయినా ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం షోకు సంబంధించిన సెట్‌, కంటెస్టెంట్ల ఎంపిక వంటి ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఇక ఈ సారి షోలో పాల్గొననున్న సెల‌బ్రిటీల లిస్ట్ ఇదే.. అంటూ ఒక జాబితా అయితే సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం ఈ సారి షోలో పాల్గొన‌నున్న సెల‌బ్రిటీల వివ‌రాలు ఈవిధంగా ఉన్నాయి.

Bigg Boss Telugu Season 6 this may be the celebrities list
Bigg Boss Telugu Season 6

ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్‌లో.. యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయి, యాంక‌ర్ వ‌ర్షిని, దీపికా పిల్లి, న‌వ్య స్వామి, ధ‌న్షు, చిత్ర రాణి, హైప‌ర్ ఆది వంటి వారు పాల్గొంటార‌ని స‌మాచారం. అయితే ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న జాబితానే. క‌నుక ఇందులో మార్పులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంటుంది. అయితే ఈ సారి షోలో అన‌సూయ‌ను కూడా తీసుకురానున్నార‌ని తెలుస్తోంది. ఆమెకు ఇందుకు గాను రూ.1 కోటి వ‌ర‌కు చెల్లించేందుకు సైతం నిర్వాహ‌కులు ముందుకు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఉంది.. అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి