Tarun : బిగ్ బాస్ 6లో త‌రుణ్‌..? ఖాయ‌మైపోయిన‌ట్లే..?

July 7, 2022 8:32 AM

Tarun : బుల్లితెర‌పై అత్యంత స‌క్సెస్‌ను సాధించిన షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. ఈ షోకు మొద‌టి నుంచి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే 5 సీజ‌న్లు పూర్తి కాగా సెప్టెంబ‌ర్ నుంచి 6వ సీజ‌న్‌ను ప్రారంభించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇంటి నిర్మాణంతోపాటు ప్ర‌స్తుతం కంటెస్టెంట్ల ఎంపిక‌ను చేప‌తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 6లో పాల్గొంటున్నారంటూ ఒక లిస్ట్ అయితే వైర‌ల్ అవుతోంది. ఇక ఇందులో లేని పేరు కొత్తది ఒక‌టి తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది. ఈ సారి సీజ‌న్‌లో ల‌వ‌ర్ బాయ్ త‌రుణ్ పాల్గొంటున్నాడ‌ని స‌మాచారం.

బిగ్ బాస్ సీజ‌న్ 6కు గాను త‌రుణ్‌ను పాల్గొనాల్సిందిగా నిర్వాహ‌కులు అడిగార‌ట‌. అయితే ఎలాగూ సినిమాలు లేవు క‌నుక ఈ షో ద్వారా అయినా స‌రే త‌రుణ్ మ‌ళ్లీ పాపుల‌ర్ అవ్వాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఆయ‌న ఇందుకు ఓకే కూడా చెప్పార‌ట‌. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6కి త‌రుణ్ దాదాపుగా ఖాయ‌మైన‌ట్లే అని స‌మాచారం. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వివ‌రాల‌ను ఇప్పుడే వెల్ల‌డించ‌రు. క‌నుక దీనిపై క్లారిటీ రావాలంటే మ‌రికొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే. ఇక ఈ సారి ఒక కామ‌న్ మ్యాన్‌కు కూడా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

Tarun may contest in Bigg Boss Telugu Season 6
Tarun

ఈ సారి సీజ‌న్‌లో కామ‌న్‌మ్యాన్ ఎంట్రీ కోసం వ‌చ్చే కంటెస్టెంట్ల‌కు ఏడు రోజుల పాటు వివిధ టాస్కుల‌ను పెడ‌తార‌ట‌. అందులో నెగ్గిన కంటెస్టెంట్‌ను కామ‌న్ మ్యాన్‌గా హౌస్‌లోకి తీసుకుంటార‌ట‌. కాగా ఈ మ‌ధ్యే బిగ్ బాస్ నాన్‌స్టాప్ పేరిట ఓటీటీ షోను నిర్వ‌హించారు. కానీ దీనికి రెస్పాన్స్ స‌రిగ్గా రాలేదు. ఇందులో న‌టి బిందు మాధ‌వి విన్న‌ర్‌గా నిలిచింది. దీంతో ఈమెతోపాటు మ‌రికొంద‌రు ఓటీటీ కంటెస్టెంట్లు ఈ సారి సీజ‌న్‌లో నేరుగా పాల్గొన‌బోతున్నారు. అయితే మిగిలిన కంటెస్టెంట్లు ఎవ‌రు..? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment