Chalaki Chanti : బిగ్ బాస్ సీజ‌న్ 6లో చ‌లాకి చంటి..? మ‌రో న‌టి కూడా..?

August 30, 2022 1:18 PM

Chalaki Chanti : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 సెప్టెంబ‌ర్ 4 నుండి స్టార్ మా లో ప్ర‌సారం కానున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. గ‌త నెల రోజుల నుండే సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌తో ఎంతో ప్రాముఖ్యాన్ని సంత‌రించుకుంది. అంతే కాకుండా ఆ షోలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్లు వీరే అంటూ వివిధ వ్యక్తుల పేర్లు కూడా అనేక‌ మాధ్య‌మాల ద్వారా ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మ‌రో ఇద్ద‌రు న‌టుల పేర్లు చేరిన‌ట్లు కొన్ని విశ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

బిగ్ బాస్ సీజ‌న్ 6 లో పాల్గొనబోయేవారిలో న‌టి అభిన‌య శ్రీ కూడా ఒక స్టార్ కంటెస్టెంట్ లా బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్టు మ‌న‌కు ఇదివ‌ర‌కే తెలిసింది. అయితే ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ద్వారా ఎంతో పాపుల‌రిటీ సంపాదించుకున్న చ‌లాకీ చంటి కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్న‌ట్టు దాదాపుగా ఖ‌రారైపోయింద‌ని అంటున్నారు. ఇక‌ ప్ర‌తి సీజ‌న్ లో జ‌బ‌ర్ద‌స్త్ షో నుండి ఎవ‌రో ఒక‌రు బిగ్ బాస్ హౌజ్ లోకి ప్ర‌వేశించ‌డం ఆనవాయితీ గా మారిపోయింది. ఈ సారి ఆ అవ‌కాశం చలాకీ చంటి కి ద‌క్కింద‌ని తెలుస్తోంది.

Chalaki Chanti in bigg boss telugu season 6
Chalaki Chanti

అలాగే వాసంతి కృష్ణ‌న్ అనే త‌మిళ బ్యూటీ కూడా మ‌రొక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజ‌న్ 6 లో రాబోతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఈమె ఇప్పుడిప్పుడే చిన్న చిన్న‌గా సినీ అవ‌కాశాలు అందుకుంటూ పైకి ఎదుగుతున్న న‌టి అని తెలిసింది. ఈ మ‌ధ్యే పండు గాడ్ మోస్ట్ వాంటెడ్ అనే తెలుగు సినిమాలో చిన్న పాత్ర‌లో మెరిసింది. కానీ దాని వ‌ల‌న‌ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇక ఈమెకు ఇన్ స్టా లో ఫాలోవ‌ర్లు కూడా బాగానే ఉన్నారు. అందులో వాసంతి త‌న‌ హాట్ హాట్ ఫోటోల‌ను రెగ్యుల‌ర్ గా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now