సోమవారం, జూన్ 22, 2026
వార్తలు

Bigg Boss 5 : బిగ్ బాస్‌ నుంచి ఎలిమినేట్ అయిన ప్రియ ఎంత రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుందో తెలుసా?

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ మంది మ‌హిళా కంటెస్టెంట్స్ బ‌య‌ట‌కు రాగా, హౌజ్‌లో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు. గ‌త వారం నామినేష‌న్‌లో ప్రియ,…

Bigg Boss 5 : బిగ్ బాస్‌ నుంచి ఎలిమినేట్ అయిన ప్రియ ఎంత రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుందో తెలుసా?

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ మంది మ‌హిళా కంటెస్టెంట్స్ బ‌య‌ట‌కు రాగా, హౌజ్‌లో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు. గ‌త వారం నామినేష‌న్‌లో ప్రియ, అనీ మాస్టర్, లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉండగా.. ప్రియ ఎలిమినేట్‌ అయింది. అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిందని కార్యక్రమ వ్యాఖ్యాత, నటుడు నాగార్జున తెలిపారు.

Bigg Boss 5 know how much priya got as remuneration

బంగారు కోడిపెట్ట టాస్క్‌లో ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. సన్నీతో ప్రతి సారి గొడవ పడడం సాధారణంగానే అనిపించినా.. తాజా ఎపిసోడ్‏లో మాత్రం ప్రియ శృతి మించి ప్రవర్తించింది. దీంతో ప్రేక్షకులకు విసుగు కలిగిలా చేసింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. అయితే ప్రియ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నటికి ఒక్క వారానికే రూ.1.50 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు రూ.10 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో, సోష‌ల్ మీడియాలో కంటెస్టెంట్స్‌కి ఉన్న‌ క్రేజ్ ఆధారంగా నిర్వాహ‌కులు రేట్ ఫిక్స్ చేశారు. ప్రియ ఎప్ప‌టి నుండో సినిమాలు చేస్తుంది. అలాగే ఇప్పుడు సీరియ‌ల్స్ కూడా చేస్తుంది. దీంతో ఆమెకు బాగానే పాపులారిటీ ఉంది. ఈ క్ర‌మంలోనే ప్రియ‌కు బాగానే ముట్ట‌జెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి