Aryan Khan : ఫోటోలకు పోజులివ్వాలన్న ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ తండ్రి.. ఫ్రస్టేట్ అయిన కొడుకు..

November 27, 2021 2:14 PM

Aryan Khan : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ క్రూయిజ్ డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్యాన్ ఖాన్ తన ఫ్రెండ్ అర్భాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలను కూడా ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రూయిజ్ షిప్ లో వీరు ముగ్గురు పార్టీ చేసుకుంటున్న టైమ్ లోనే డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా ముంబై కోర్ట్ లో ఈ ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు పోలీసుల ఆధ్వర్యంలో సంతకాలు చేయాల్సి ఉంది.

Aryan Khan : ఫోటోలకు పోజులివ్వాలన్న ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ తండ్రి.. ఫ్రస్టేట్ అయిన కొడుకు..
Aryan Khan

అలా రీసెంట్ గా ఆర్యన్ ఖాన్, అర్భాజ్ మర్చంట్ సైన్ చేసేందుకు ఎన్సీబీ ఆఫీస్ లకు వచ్చారు. అర్బాజ్ మర్చంట్ వస్తూండగా ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ అర్బాజ్ పట్టించుకోకుండా వెళ్లాడు. స్టేషన్ ముందు ఉన్న అర్బాజ్ తండ్రి అతన్ని ఆపి వెనక్కి లాగి మరీ ఫోటోలకు పోజులివ్వాలని అన్నాడు. దీంతో అర్బాజ్ కి కోసం వచ్చి.. స్టాపిట్ డాడ్‌.. అని అసహనం వ్యక్తం చేశాడు. తన కొడుకు ఫ్రస్టేషన్ చూసి అస్లామ్ నవ్వుకున్నారు.

ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బెయిల్‌ వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నావు. కానీ ఆ బెయిల్ రావడానికి ఆ తండ్రి పడిన కష్టం గురించి ఆలోచించావా.. ఒకవేళ బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే తన కొడుకు పై వచ్చిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. ముంబై కోర్ట్ కూడా ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపిందని ఆయన అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now