Aryan Khan : బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు క‌దా..!

November 7, 2021 10:43 PM

Aryan Khan : క్రూయిజ్ షిప్ లో ఓ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకున్నాడ‌ని, డ్ర‌గ్స్ విక్ర‌యించాడ‌ని.. ఎన్‌సీబీ దాదాపుగా 20 రోజుల‌కు పైగానే ఆర్య‌న్ ఖాన్‌ను జైలులో ఉంచింది. అయితే మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్‌, సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహత్గీ రంగ ప్ర‌వేశం చేసి కేవ‌లం 2 రోజుల్లోనే బెయిల్ వ‌చ్చేలా చేశారు. దీంతో షారూఖ్ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. అయితే బెయిల్ ల‌భించిన‌ప్ప‌టికీ డ్ర‌గ్స్ కేసు ఆర్య‌న్ ఖాన్‌ను ఇప్పుడ‌ప్పుడే వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.

Aryan Khan got bail but problems are not going away

ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్టు చేసిన స‌మీర్ వాంఖెడె అత‌న్ని విడిచిపెట్టేందుకు రూ.25 కోట్లు డిమాండ్ చేశార‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేసు విచార‌ణ న‌డుస్తోంది. ఇక ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు స‌రే స‌రి. బెయిల్ ల‌భించినా ఎన్‌సీబీ అధికారులు పిలిచిన‌ప్పుడు వెళ్లాలి. లేదా వారు వ‌చ్చినా విచార‌ణ‌కు స‌హ‌క‌రించాలి.

ఇక ఎన్‌సీబీపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు, ఆర్య‌న్ ఖాన్ కేసు ద‌ర్యాప్తుకు ఎన్‌సీబీ ప్ర‌త్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసులో అంద‌రు నిందితుల‌ను విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆర్బాజ్ మ‌ర్చంట్‌ను అధికారులు విచారించారు. అయితే ఆదివార‌మే ఆర్య‌న్‌ను కూడా విచార‌ణ‌కు పిలిచినా.. అత‌ను అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా రాలేన‌ని చెప్పాడు. దీంతో సోమవారం అత‌ను సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది.

ఏది ఏమైనా.. ఆర్య‌న్ ఖాన్ బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చినా.. అత‌ను కొద్ది రోజులు కూడా సంతోషంగా లేడు. కేసులు అని, విచార‌ణ అని.. మ‌ళ్లీ తిర‌గాల్సి వ‌స్తోంది. ఓ వైపు అత‌న్ని బాలీవుడ్‌కు పరిచ‌యం చేద్దామ‌ని షారూఖ్ క‌ల‌లు క‌న్నాడు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. మ‌రి ఈ కేసులో అత‌ను నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now